ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారు.. కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే డేంజర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలను వైరల్ చేశారన్నారు. ఈ అంశంలో ఫేక్ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని తెలిపారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్‌ను సిద్ధం చేశామన్నారు సీఎం రేవంత్. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
వివాదంపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్..
ఈ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ వచ్చిన పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై వివిధ వర్గాలతో చర్చిస్తామని తెలిపారు. ముగ్గురు మంత్రుల కమిటీతో సమావేశమైన ఆమె.. వివాదం మొదలైన తీరు, రాజకీయపక్షాల విమర్శలపై ఆరా తీశారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, కౌంటర్ కాపీపైనా మంత్రుల కమిటీతో చర్చించారు. అన్ని వర్గాలతో చర్చించిన తరువాత సమస్యకు ఓ పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి కంచ గచ్చిబౌలి భూవివాదం వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ అంశంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయి ? కాంగ్రెస్ ఇంఛార్జ్ ఏ రకమైన అభిప్రాయానికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..