CM KCR: ‘పటాన్‌చెరు వరకు మెట్రో విస్తరిస్తాం.. తొలి సమావేశంలోనే ఆమోదం’. సీఎం కేసీఆర్‌ ప్రకటన.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటాన్‌చెరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొల్లూరులో 128 ఎకరాల్లో నిర్మించిన 15,600 డబుల్​బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం పటాన్​చెరు పట్టణంలో సుమారు రూ.184 కోట్లతో 200 బెడ్‌ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో...

CM KCR: 'పటాన్‌చెరు వరకు మెట్రో విస్తరిస్తాం.. తొలి సమావేశంలోనే ఆమోదం'. సీఎం కేసీఆర్‌ ప్రకటన.
CM KCR
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 22, 2023 | 3:05 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటాన్‌చెరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొల్లూరులో 128 ఎకరాల్లో నిర్మించిన 15,600 డబుల్​బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం పటాన్​చెరు పట్టణంలో సుమారు రూ.184 కోట్లతో 200 బెడ్‌ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం పటాన్‌చెరు వాసులకు శుభవార్త తెలిపారు. భవిష్యత్తులో పటాన్‌చెరు వరకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయమై కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘పటాన్‌చెరు వరకు మెట్రో కావాలని అడుగుతున్నారు. తప్పకుండా మెట్రో పటాన్‌ చెరు వరకు రావాలి. హైదరాబాద్‌ సిటీలో ఎక్కువగా ట్రాఫిక్‌ ఉండే కారిడార్‌ పటాన్‌చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు. కాబట్టి పటాన్‌చెరు నుందచి హయత్‌ నగర్‌ వరకు కచ్చితంగా మెట్రో వచ్చి తీరుతుంది. అయితే మీరు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే వచ్చి తీరుతుంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే మొట్ట మొదటి క్యాబినేట్‌ మీటింగ్‌లో పటాన్‌ చెరు నుంచి హయత్‌ మెట్రో రైలుకు ఆమోదముద్ర వేస్తామని మాటిస్తున్నాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడిగిన మేరకు పాలిటెక్నిక్‌ కళాశాలకు ఈరోజు జీవో జారీ చేస్తాము’ అని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ ఇంకా మాట్లాడుతూ.. పటాన్‌ చెరులో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం. ఈ విషయమై కేటీఆర్‌తో మాట్లాడుతాను. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలి. రామసముద్రం చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..