CM KCR Martyr’s Memorial Inauguration Highlights: నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరి మీద జరిగి ఉండదేమో: సీఎం కేసీఆర్
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి కేసీఆర్ చేరుకున్నారు. స్మారక నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత, అమర జ్యోతి వద్దకు చేరుకున్నారు. అనంతరం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కళాకారుల నృత్యాలతో సందడిగా ..

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి కేసీఆర్ చేరుకున్నారు. స్మారక నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత, అమర జ్యోతి వద్దకు చేరుకున్నారు. అనంతరం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కళాకారుల నృత్యాలతో సందడిగా నెలకొంది. భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు- కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. వారి త్యాగాలు ఎన్నటికి మర్చిపోలేమని అన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ సన్మానించారు.
-
పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి – కేసీఆర్
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని, పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. చాలా ప్రత్యేక శ్రద్దతో ఈ స్మారక చిహ్నం రూపొందించామన్నారు.
-
-
తెలంగాణ చరిత్ర కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శన
తెలంగాణ అమరవీరుల స్మాకాన్ని నిర్మించడంతో ఎంతో సంతోషకరమని, రమణారెడ్డి కళాచాతుర్యంతో అమరజ్యోతి రూపొందించారని కేసీఆర్ అన్నారు. ఇందులో తెలంగాణ చరిత్ర కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు.
-
ఉద్యమం కోసం చాలా మందిని కన్విన్స్ చేస్తూ ముందుకు సాగం- కేసీఆర్
తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం కోసం చాలా మందిని కన్విన్స్ చేస్తూ ముందుకు సాగామని అన్నారు. ఎన్నిసార్లు రాజీనామా చేశౄమో లెక్కేలేదని, నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరి మీద జరిగి ఉండదన్నారు. ఆ తిట్లే దీవెనలని భావించి ముందుకు సాగామన్నారు. 14ఎఫ్ నిబంధనకు వ్యతిరేకంగా నేను ఆమరణ దీక్షకు దిగానని, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టానని అన్నారు.
-
నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎంతో గొప్పగా పని చేశారు- కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎంతో గొప్పగా పని చేశారని కేసీఆర్ అన్నారు. పిడికెడు మందితో మేము ఐదారు గంటలు మేధోమధనం చేశాం. అనేక మందిని మేము సంప్రదించి వ్యూహంతో బయలుదేరాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తలెంగాణ వాది అని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో ఆయన ఏనాడు వెనుకడుగు వేయలేదన్నారు.
-
-
రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది- కేసీఆర్
తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో ముగింపు కార్యక్రమం జరిగింది. అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, 1966లో ఖమ్మం నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైందని అన్నారు. ఆ తర్వాత అది యూనివర్సిటీలకు చేరింది. తెలంగాణ అనుభవించని బాధ లేదు. ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టిందని అన్నారు.
-
కేసీఆర్ ప్రసంగం
ట్యాంక్‌బండ్‌పై అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. తెలంగాణ అమరుకలు నివాళి అర్పించడం సంతోషంగా ఉందన్నారు.
-
3.26 ఎకరాల్లో స్మారక చిహ్నాం
అమరవీరుల స్మారకాన్ని హుస్సేన్‌సారగ్ తీరాన లుంబినీ పార్క్ వద్ద నిర్మించారు. 3.29 ఎకరాల్లో రూ.155 కోట్లతో నిర్మాణం చేపట్టారు. 26,800 చ.మీ విస్తీర్ణంలో ప్రమిద ఆకాలంలో స్మారకాన్ని నిర్మించారు.
-
అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
-
రూ.155 కోట్లతో అమవీరుల స్మారక ద్వీపం
ట్యాంక్ బండ్‌పై రూ.155 కోట్లతో ఈ అమరవీరుల స్మారకాన్నినిర్మించారు. కేసీఆర్ ప్రారంభించిన తర్వాత డ్రోన్ షో నిర్వహించనున్నారు. సుమారు 800 డ్రోన్లతో స్పెషల్ షోని నిర్వహించనున్నారు.
-
అమరవీరులకు కేసీఆర్ నివాళి
ట్యాంక్ బండ్‌పై అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు అమరవీరులకు నివాళిగా వందనం చేశారు.
-
అమరవీరుల స్మారకం వద్దకు చేరుకున్న కేసీఆర్
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి కేసీఆర్ చేరుకున్నారు.
Published On - Jun 22,2023 6:53 PM




