AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అలర్ట్.. ప్రాణాలు తీస్తున్న కంటికి కనిపించని దారం.. రెండు రోజుల్లోనే హైదరాబాద్‌లో ఆరుగురు మృతి..

కంటికి కనిపించినటువంటి దారం ఉరితాడు లాగా మారి ఎన్నో ప్రాణాలను తీస్తూ.. కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. అన్యం పుణ్యం తెలియనటువంటి చిన్నారులతో మొదలుకుని.. పెద్ద వాళ్ళ వరకు ఈ దారం వారి కుటుంబాల పాలిట శాపంగా మారింది. అదే.. పతంగులు ఎగురవేసే.. చైనా మాంజ.. ప్రస్తుతం ఈ పేరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

Hyderabad: అలర్ట్.. ప్రాణాలు తీస్తున్న కంటికి కనిపించని దారం.. రెండు రోజుల్లోనే హైదరాబాద్‌లో ఆరుగురు మృతి..
Chinese Manja
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 3:27 PM

Share

కంటికి కనిపించినటువంటి దారం ఉరితాడు లాగా మారి ఎన్నో ప్రాణాలను తీస్తూ.. కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. అన్యం పుణ్యం తెలియనటువంటి చిన్నారులతో మొదలుకుని.. పెద్ద వాళ్ళ వరకు ఈ దారం వారి కుటుంబాల పాలిట శాపంగా మారింది. అదే.. పతంగులు ఎగురవేసే.. చైనా మాంజ.. ప్రస్తుతం ఈ పేరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సంక్రాంతి పండగ అనగానే గాలిపటాలు గుర్తొస్తాయి. దానితోపాటు అత్యంత ప్రమాదకరమైన చైనా మాంజా కూడా వణుకుపుట్టిస్తుంది. ప్రతి సంవత్సరంలోనే ఈ ఏడాది కూడా చైనా మాంజ కొందరి కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. కొంతమంది గాలిపటాలను ఎగరేస్తూ కరెంటు షాక్ తో చనిపోతే.. మరి కొంతమంది గాలిపటాలు ఎగురవేసే ప్రయత్నంలో బిల్డింగ్‌లపై నుంచి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా గాలిపటాలు చాలా ప్రాణాలు గాల్లో కలిసేలా చేశాయి.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు రోజుల వ్యవధిలోనే గాలిపటాలు ఎగురవేసుకుంటూ ఆరుగురు మృత్యువాత పడ్డారు. అత్తాపూర్‌లో ఓ బాలుడు తన అన్నతో కలిసి గాలిపటాన్ని ఎగరవేసేందుకు వెళ్లి మృతి చెందాడు. మరొకవైపు అల్వాల్లో గాలిపటం ఎగరవేసుకుంటూ నాలుగో అంతస్తుపై నుంచి పడిపోయి ఓ బాలుడు మృతి చెందాడు. ఇక చైనా మంజ ఓ ఆర్మీ జవాన్ మెడకు చుట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటనలు సంక్రాంతి పండగ రోజు జరగడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

తాజాగా యాప్రాల్‌లో గాలిపటం ఎగరవేస్తుండగా.. అది ఓ వైరుకు చిక్కుకోవడంతో రాడ్డుని తీసే ప్రయత్నంలో భాగంగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే ఓ చిన్నారి మృతి చెందాడు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వారి తల్లిదండ్రులు పక్కనే ఉండాల్సిందిగా పోలీసులు సూచించినా.. ఈ అనుమానాస్పద సంఘటనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి.

చైనా మాంజా వల్ల ఆర్మీ జవాన్ తో పాటుగా సంగారెడ్డిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయమైంది. ఇదిలాఉంటే.. విశాఖపట్నంలో సైతం ఓ చిన్నారి మెడకు చైనా మాంజా చుట్టుకుని.. గొంతుకు తీవ్ర గాయమైంది.

ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. చైనా మాంజాను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న షాపులలో మంగళహాట్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 18 మంది పైన కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు అధికారులు. ఈ చైనా మాంజా వలన కేవలం మనుషులే కాకుండా పక్షులు సైతం చనిపోతున్నాయి. రానున్న రోజుల్లో చైనా మాంజాపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..