Asaduddin Owaisi: ఢిల్లీలో సుందరకాండ పారాయణంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..
ప్రస్తుతం దేశం మొత్తం జనవరి 22న ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి నెలా సుందరకాండ పారాయణం నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం దేశం మొత్తం జనవరి 22న ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి నెలా సుందరకాండ పారాయణం నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఆర్‌ఎస్‌ఎస్ చిన్న రీచార్జ్ పార్టీ అంటూ అసద్ టార్గెట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఎజెండాను అనుసరిస్తోందని కూడా ఆయన మండిపడ్డారు.
ప్రతి నెలా సుందరకాండను నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన తర్వాత, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఒక ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో విషయంలో ఆప్ మౌనంగా ఉందని ఆరోపిస్తూ, “ప్రతి నెల మొదటి మంగళవారం ఢిల్లీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుందర్‌కండ్ పాత్ నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్ ఛోటా రీచార్జ్ నిర్ణయించింది. బిల్కిస్ బానో సమస్యపై ఈ వ్యక్తులు మౌనం వహించారని, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలపై మాత్రమే మాట్లాడాలనుకుంటున్నారని మీకు గుర్తు చేస్తాను. సుందరకాండ పాఠం విద్య లేదా ఆరోగ్యమా? అసలు విషయం వారు న్యాయాన్ని తప్పించుకుంటున్నారని.. వారు సంఘ్ ఎజెండాకు పూర్తిగా మద్దతిస్తున్నారు. బాబ్రీ గురించి మనం మాట్లాడకుండా, మీరు న్యాయం, ప్రేమ, అలా అని బాకా వాయిస్తూనే ఉంటారు. అదే సమయంలో హిందుత్వను బలోపేతం చేస్తూ ఉండండి. ” అంటూ ఘాటుగా విమర్శించారు అసదుద్దీన్. ఢిల్లీ సీఎంపై మాటల దాడికి దిగిన ఒవైసీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండాకు కేజ్రీవాల్ పూర్తిగా మద్దతిస్తున్నారని ఆరోపించారు.
RSS का छोटा रीचार्ज ने फ़ैसला लिया है के दिल्ली की हर विधान सभा क्षेत्र में हर महीने के पहले मंगलवार को सुंदरकांड पाठ का आयोजन किया जाएगा। ये फ़ैसला 22 जनवरी के उद्घाटन की वजह से लिया गया।
आपको याद दिला दूँ के ये लोग ने बिल्किस बानो के मसले पर चुप्पी बनाई रखी थी और कहा था के वो…
— Asaduddin Owaisi (@asadowaisi) January 15, 2024
ఇదిలావుంటే జనవరి 15, 2024న అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు, ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో AAP నాయకులు సుందరకాండను పఠిస్తారని చెప్పారు. ఈ మేరకు ఆప్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆప్ ప్రకారం, పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ పాత్‌ను నిర్వహిస్తారు. ఈ సమయంలో సుందరకాండతో పాటు హనుమాన్ చాలీసా కూడా పఠిస్తారని తెలిపారు.
మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
