AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: సూపర్‌ డిమాండ్‌ ఉ‍న్న ఫుడ్‌! సింపుల్‌గా తయారు చేసి అమ్మి.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించే మీల్ మేకర్ తయారీ బిజినెస్‌.. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ ఫుడ్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చిన్న స్థలంలో, తక్కువ ఖర్చుతో యంత్రాలు కొనుగోలు చేసి, ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఉత్పత్తి ఖర్చు తక్కువ, అమ్మకం ధర ఎక్కువ కాబట్టి మంచి లాభాలు పొందవచ్చు.

Business Idea: సూపర్‌ డిమాండ్‌ ఉ‍న్న ఫుడ్‌! సింపుల్‌గా తయారు చేసి అమ్మి.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
Money 5
SN Pasha
|

Updated on: Feb 12, 2026 | 7:30 AM

Share

అతి తక్కువ పెట్టుబడితో ఒక మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన చాలా మందికి ఉన్నా.. దాన్ని ఆచరణలో చాలా తక్కువ మంది పెడుతుంటారు. కొంతమందికి సరైన అవగాహన లేక బిజినెస్‌ స్టార్ట్‌ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే తక్కువ పెట్టబడి, మంచి డిమాండ్‌ ఉన్న ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకునే వాళ్లుకు ఇది ఉపయోగపడొచ్చు. ఇప్పుడు మీల్‌ మేకర్‌ తయారీ బిజినెస్‌ గురించి తెలుసుకుందాం.. తక్కువ కాస్ట్ లో అందరికి అందుబాటులో ఉండే ఈ రుచికరమైన ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం. రుచే కాదు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

మీల్‌ మేకర్‌ తక్కువ కాస్ట్ లో దొరికే ప్రోటీన్ రిచ్ ఫుడ్. జిమ్ములుకెళ్లే యువతతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకునే వారికీ కూడా ఇది ఇష్టమైన ఫుడ్. ఇక ధర పరంగా చూస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. అందుకే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. మరి అంత డిమాండ్ ఉన్న ఈ మీల్ మేకర్ ను బిజినెస్ గా చేసుకుంటే? ఈ రోజు మీరు తెలుసుకోబోయే బిజినెస్ ప్లాన్ ఇదే. మీల్‌ మేకర్‌ తయారీకి పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు. 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. చిన్న స్థాయిలో మొదలుపెట్టాలంటే ముందుగా మీల్‌ మేకర్‌ ఎక్స్‌ట్రూడర్ మిషన్ కావాలి.

ఈ మిషన్ సోయా ఫ్లోర్‌ను చంక్స్ రూపంలోకి మార్చుతుంది. తయారైన సోయా బాల్స్ లో తేమ తీసేయడానికి ఒక చిన్న డ్రయ్యర్ అవసరం అవుతుంది. అలాగే తయారైన ప్రొడక్ట్‌ను సరైన బరువుతో ప్యాక్ చేయడానికి డిజిటల్ వెయింగ్ స్కేల్, హీట్ సీలింగ్ మిషన్ ఉంటే సరిపోతుంది. ఈ కొద్దిపాటి మెషినరీతోనే రోజుకు 50 నుంచి 100 కిలోల వరకు సోయా చంక్స్ తయారు చేసి వ్యాపారం ప్రారంభించవచ్చు. దీనికి అయ్యే ఖర్చు ఎక్స్‌ట్రూడర్ మిషన్ ధర సుమారు రూ.1,50,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇక డ్రయ్యర్లు రూ.70,000 నుండి మొదలవుతాయి.

ఇక ప్యాకింగ్ కోసం హీట్ సీలింగ్ మిషన్, డిజిటల్ వెయింగ్ స్కేల్ కలిపి మరో రూ.15,000 నుండి రూ.25,000 వరకు ఖర్చు అవుతుంది. చిన్న కన్వేయర్ లేదా మిక్సర్ లాంటి అవసరమైన ఇతర ఐటమ్స్‌కి సుమారు రూ.30,000 రూపాయల నుండి ఇండియా మార్ట్ లో లాంటి వెబ్ సైట్ లలో దొరుకుతాయి. డీఫ్యాటెడ్ సోయా ఫ్లోర్, గోధుమ పిండి మీ ప్రొడక్షన్ ను బట్టి రా మెటీరియల్స్ అవసరం పడతాయి. ఈ సోయా ఫ్లోర్ కూడా ఆన్లైన్ లో మీకు రూ.50 కిలో నుండి స్టార్ట్ అవుతుంది. ముందుగా తక్కువగా మెటీరియల్ తో స్టార్ట్ చేసి మెల్లగా సేల్స్ ను బట్టి పెంచుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో అమ్మొచ్చు. ఆఫ్‌లైన్‌లో హోటల్స్, మెస్‌లు, హాస్టల్స్, కిరాణా షాప్స్‌లో హోల్‌సేల్‌గా అ‍మ్మండి. ఆన్‌లైన్‌లో Amazon, Flipkart లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రొడక్ట్‌ను లిస్ట్ చేసి అమ్మొచ్చు. ఇక లాభాలను చూస్తే ప్రొడక్షన్, సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక కిలో మీల్‌మేకర్‌ తయారీకి రూ.70 వరకు ఖర్చు అవుతుంది. హోల్ సేల్ గా హోటల్స్ లేదా షాప్స్‌కు 90 రూపాయలకు కిలో, అదే ఆన్‌లైన్ లేదా రిటైల్ ప్యాక్‌గా 90–110 వరకు అమ్ముకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి