CM KCR: 15 అంతస్థుల భవనం, 11 ఎకరాల స్థలంలో.. భారత్‌ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన..

హైదరాబాద్‌ కోకాపేట్‌లో భారత్‌ భవన్‌కు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. అతిపెద్ద డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. 15 అంతస్థుల భవనం, 11 ఎకరాల స్థలంలో భవనం నిర్మాణం చేయనున్నారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ & HRDగా పేరు పెట్టారు. ఇక్కడ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

CM KCR: 15 అంతస్థుల భవనం, 11 ఎకరాల స్థలంలో.. భారత్‌ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన..
CM KCR
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 05, 2023 | 1:27 PM

భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మిస్తున్న భారీ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. భూమి పూజ సందర్బంగా చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.

రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ఈ నూతన కట్టడం  పని చేయనుంది. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టులగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రం ఇందులో ఉండనుంది. దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారు.

ఈ 15 అంతస్థుల్లో భవనంలో పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్‌ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ట్రాలవారిగా, రంగాలవారీగా వివరాలను ఇక్కడ స్టోర్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!