AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuga Thulasi Foundation: గో హత్యలకు వ్యతిరేకంగా రేపు గో ఆగ్రహ నిరాహారదీక్ష.. భారీగా తరలిరావాలని పిలుపు

Yuga Thulasi Foundation: అభం శుభం తెలియని గోవులను హత్య చేస్తుంటే.. వాటిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌, టీటీడీ పాలకమండలి..

Yuga Thulasi Foundation: గో హత్యలకు వ్యతిరేకంగా రేపు గో ఆగ్రహ నిరాహారదీక్ష.. భారీగా తరలిరావాలని పిలుపు
Representative Image
Subhash Goud
|

Updated on: Dec 04, 2021 | 7:21 PM

Share

Yuga Thulasi Foundation: అభం శుభం తెలియని గోవులను హత్య చేస్తుంటే.. వాటిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శివకుమార్‌ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ డిసీపీ, బహదూర్ పుర ఏసీపీ, సీఐలపై కేసులు నమోదు చేయాలని.. తగిన సాక్షాలతో హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. గో హత్యలకు వ్యతిరేకంగా రేపు గో ఆగ్రహ నిరాహారదీక్ష నిర్వహస్తున్నారు. చలో బహదూర్‌పురకి పిలుపునిచ్చామని అన్నారు. మింట్ కాంపౌండ్ త్రి శక్తి హనుమాన్ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

హిందు, గో బంధువులు తరలిరావాలి:

గో హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యమం మరింత తీవ్రతరం చేయాలని ఆయన సూచిస్తున్నారు. గోవులను కాపాడుకోలేకపోతే మున్ముందు మరిన్ని గో హత్యలు పెరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకే నిరాహార దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఈ దీక్షకు హిందు, గో బంధువులు కదలి రావాలని శివకుమార్‌ పిలుపునిచ్చారు. గో రక్షణ కోసం ప్రతి హిందువు కృషి చేయాలన్న ఆయన.. గో మారణఖాండను ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. గోవు కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫల మవుతున్నాయని ఆయన ఆరోపించారు. గో హత్యలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసి కఠిన శిక్షణ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే గోవధను అరికట్టాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని వివిధ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గోవును దానం చేస్తే ఎంతో పుణ్యం..

భారతీయులు గోవును పవిత్రంగా భావిస్తారు. గోవు పాలు, మూత్రము, అలాగే పేడ ఎంతో పవిత్రమైనదిగా భివిస్తారు. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావిస్తుంటారు. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Asthma: అస్తమా ఉన్న పిల్లలు కరోనా బారిన పడితే ప్రమాదమే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..!

Baby teeth: పిల్లల్లో పాల దంతాలు ఊడిపోవడానికి కారణం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..!

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!