AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: టార్గెట్-2023.. దూకుడు పెంచిన బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్

టార్గెట్-2023. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్లానింగ్ ముమ్మరం చేసింది బీజేపీ. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఓ పార్టీని విలీనం చేసుకోవడంపై జోరుగా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana BJP: టార్గెట్-2023.. దూకుడు పెంచిన బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్
Bandi Sanjay Kumar
Janardhan Veluru
|

Updated on: Dec 04, 2021 | 6:48 PM

Share

టార్గెట్-2023. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్లానింగ్ ముమ్మరం చేసింది బీజేపీ. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఓ పార్టీని విలీనం చేసుకోవడంపై జోరుగా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ BJP దూకుడు పెంచింది. హైకమాండ్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హుజురాబాద్ బైపోల్‌లో విజయం సాధించిన తర్వాత పార్టీ బలోపేతంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. KCR వ్యతిరేక శక్తులను ఏకం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తులతోపాటు… పార్టీని వ్యతిరేకించి బయటకు వస్తున్నవారిని అక్కున చేర్చుకుంటోంది కమలదళం. సొంత కుంపటి పెట్టిన వాళ్ళను కూడా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఉద్యమ నాయకులు స్వామి గౌడ్, దిలీప్, రవీంద్ర నాయక్, ఈటల రాజేందర్‌ వంటి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. త్వరలోనే విఠల్‌ కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

వ్యక్తులే కాదు.. చిన్న, చిన్న పార్టీలపైనా BJP ఫోకస్ చేస్తోంది. యువ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే దిశగా చర్చలు సాగిస్తోంది. ఆ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమతో ఇప్పటికే మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే జిట్టా బాలకృష్ణకు భవనగిరి అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటు, రాణిరుద్రమకు వరంగల్ జిల్లాలో ఒక స్థానం ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు సమాచారం. బీజేపీ నాయకత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు ఓ కొలిక్కిరాగానే త్వరలోనే చేరికలు ఉంటాయన్న టాక్‌ నడుస్తోంది.

Bandi Sanjay

Bandi Sanjayయువ తెలంగాణతో పాటు మరో పార్టీని కూడా విలీనం చేసుకోవాలని చూస్తోంది BJP. ఉద్యమ సమయంలో కీ రోల్‌ పోషించిన నేత నడుపుతున్న పార్టీతోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్‌ మొదలు పెట్టింది BJP. ఎలక్షన్‌టైమ్‌కు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మరింత ముమ్మరం చేయాలని భావిస్తోందట కమలదళం.

Also Read..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటున్న అభిమానుల రచ్చ..

Viral News: పాములు ఇంట్లోకి వస్తున్నాయని.. పొగ బెట్టాడు.. చివరకు ఏమైందంటే..?