Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

బాలయ్య అఖండ థియేటర్లను షేక్ చేస్తుంది.. ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న థియేటర్లు బాలయ్య శివతాండవంతో రీసౌండ్‌ చేస్తున్నాయి

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..
అందులో ముఖ్యంగా హిందూ ధర్మం గురించి హిందూ టెంపుల్స్ పరిరక్షణ గురించి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 04, 2021 | 6:52 PM

బాలయ్య అఖండ థియేటర్లను షేక్ చేస్తుంది.. ఇన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న థియేటర్లు బాలయ్య శివతాండవంతో రీసౌండ్‌ చేస్తున్నాయి. హస్‌ఫుల్ బోర్డులతో కలకలలాడేలా చేస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇతర దేశాల్లోనూ అఖండ మాస్ జాతర సాగుతోంది. నందమూరి అభిమానులనే కాకుండా.. అందర్నీ థియేటర్ల బాట పట్టిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించి ఆకట్టుకున్నారు.  అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఏ సినిమా చేయని పనిని బాలయ్య సినిమా తాజాగా చేసింది. ఏకంగా అఘోరాలనే ఆకట్టుకుని అఖండ థియేటర్ల వైపు కదిలించింది. అందర్నీ షాక్ చేసింది. ఇప్పుడిదే న్యూస్‌ అంతటా వైరల్ అవుతోంది.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌కు వచ్చిన అఘోరాలు.. బాలయ్య అభిమానులతో కాసేపు ముట్టించారు. ఆ తరువాత అఖండ సినిమాను చూసి.. ఆనందించారు. ఈ సినిమా కోసమే థియేటర్‌కు వచ్చామంటూ చెప్పారు. అభిమానులతో కలిసి శివనామస్మరణ చేశారు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అఘోరాలు అఖండ సినిమా చూడ్డానికి రావడం చూసి బాలయ్య హార్డ్‌ కోర్‌ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య పవర్‌ అంటే అదే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిత్యం శివ నామస్మరణ చేసే అఘోరాలు.. బాలయ్య సినిమాకు రావడం.. ఆయనను వారు ఆశీర్వదించడమేనని అన్నారు. ఇక బాలయ్యకు ఇప్పటికీ ఎప్పటికీ తిరుగేలేదని.. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

Also Read: RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..

Manchu Vishnu: అచితూచి మాట్లాడండి.. ఇచ్చే స్టేట్‏మేంట్స్ ఇండస్ట్రీపై పడుతుంది.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Aadya: గిటార్‏ వాయిస్తూ పాట అదరగొట్టిన పవన్ కూతురు.. ఆద్య టాలెంట్‏కు అభిమానులు ఫిదా..