RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 04, 2021 | 6:10 PM

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నాడు జక్కన్న. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు. దీంతో మెగా నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.

ట్వీట్..

ఈ చిత్రాన్ని దాదాపు రూ.450 కోట్లు భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read: manchu Vishnu: అచితూచి మాట్లాడండి.. ఇచ్చే స్టేట్‏మేంట్స్ ఇండస్ట్రీపై పడుతుంది.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Aadya: గిటార్‏ వాయిస్తూ పాట అదరగొట్టిన పవన్ కూతురు.. ఆద్య టాలెంట్‏కు అభిమానులు ఫిదా..

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు