Care Awards: కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు కేర్ అవార్డులు.. 100 మందికి అందజేత..
కరోనా సమయంలో సేవలందించిన డాక్టర్ కేర్ వైద్యులకు ఈ రోజు డాక్టర్ కేర్ అవార్డులు ప్రదానం చేశారు.

కరోనా సమయంలో సేవలందించిన వైద్యులకు డాక్టర్ కేర్ అవార్డులను ప్రదానం చేశారు. 2 వేల మంది పని చేసే డాక్టర్ కేర్ సంస్థలో కోవిడ్ విపత్కర పరిస్థితిలో సేవలందించిన వందమంది డాక్టర్లను గుర్తించి అవార్డు, ప్రశంసా పత్రంతో సత్కరించారు. విపత్కర పరిస్థితులలో వారు కుటుంబాలకు దూరంగా ఉండి రోగులకు సేవ చేయడం గొప్ప విషయమని వక్తలు అన్నారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ హాజరై అవార్డులను బహుకరించారు.

కరోనా సమయంలో వైద్యులు వల్లే సమాజంలో ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ఇలాంటి వైద్యులు సమాజంలో లేకపోతే మనం జీవించి ఉండేవాళ్లం కాదని చెప్పారు. డాక్డర్ కేర్ చేస్తున్న సేవలకు గానూ ఈ రోజు డాక్టర్ కేర్ అచీవర్స్-21 అవార్డు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డు వారికి ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ అధినేత AM రెడ్డి పాల్గొన్నారు. వైద్య రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్న దంత వైద్యురాలు, పాజిటివ్ డెంటల్ సీఈవో డా. పేర్ల సృజనకు ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు 2021ను ప్రదానం చేశారు.
Read Also.. రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ టోపీ.. ఈ మోసానికి పాల్పడింది ఓ మాజీమంత్రి బంధువు..