Ram Nath Kovind: రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ఖరారు..శీతాకాల విడిదిలో భాగంగా భాగ్యనగరానికి..
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈనెల 29న భాగ్యనగరానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన ఈనెల 29న భాగ్యనగరానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. వచ్చే నెల మూడో తేదీ వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. అయితే ఒమిక్రాన్ ప్రకంపనల నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటనపై ముందుగా కొంచెం సందిగ్ధం నెలకొంది. అయితే తాజాగా కొవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ పర్యటనకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా రాష్ట్రపతి పర్యటన కోసం గత వారం రోజులుగా రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదార్లను మరమ్మతులు చేయడంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా విష సర్పాలను పట్టుకుని జూపార్కుకు తరలిస్తున్నారు.
Also Read:
Bandi Sanjay: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వెంటనే పునరుద్ధరించాలిః బండి సంజయ్