Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది

సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది
Allu Arjun Arrest = Ktr
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 13, 2024 | 1:59 PM

సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్‌ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను.. సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నాను. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్‌ ఎందుకు చేయరని కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

మరోవైపు అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్‌పై 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు కాగా.. నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి పదేళ్లు జైలుశిక్షపడే అవకాశం ఉంది. అటు BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కాగా.. సెక్షన్‌ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే.. 5 నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఇక 118(1) కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

అటు చిక్కడపల్లి PS నుంచి ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్‌ తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత.. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు. అల్లు అర్జున్‌ని రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ప్రకారం రిమాండ్‌ రిపోర్ట్‌ రెడీ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌‌ను సైతం రికార్డు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి