Revanth Reddy: సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. వేద పండితుల ఆశీర్వచనం..
ప్రమాణ స్వీకారం చేసిన రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మారుస్తామనీ.. అక్కడ రేపు ఉదయం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకార వేదికపైనే దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ.. ఆర్డర్ కాపీపై సంతకం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ ను జ్యోతిబాపూలే ప్రజాభవన్‌గా మారుస్తామనీ.. అక్కడ రేపు ఉదయం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకార వేదికపైనే దివ్యాంగురాలు రజినీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ.. ఆర్డర్ కాపీపై సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు.
అనంతరం తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ తొలి సమావేశం జరుగుతోంది. సమావేశానికి హాజరైన 11 మంది మంత్రులు హాజరయ్యారు.
వీడియో చూడండి..
ఆంక్షలు ఎత్తివేత..
ఇన్నాళ్లు తెలంగాణ సీఎం అధికార నివాసంగా ఉన్న ప్రగతి భవన్ పరిసరాల్లో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు తొలగించారు. ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు తొలగించే పనులు మొదలయ్యాయి. గ్యాస్ కట్టర్స్‌తో కట్ చేసి బ్యారికేడ్లను తొలగిస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తిగా తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
