నాడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్… నేడు తెలంగాణ గవర్నర్

నాడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్... నేడు తెలంగాణ గవర్నర్

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు డా. సౌందరరాజన్ నియమితులయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీ చీఫ్ గా ఈమె పదవీకాలం డిసెంబరుతో ముగుస్తోంది. దీంతో ఆమెను కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించింది. తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టకముందు కూడా సౌందరరాజన్ పార్టీకి విశేష కృషి చేశారు. 1999 లో సౌత్ చెన్నై డిస్ట్రిక్ట్ మెడికల్ విభాగం కార్యదర్శి స్థాయి నుంచి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. […]

Anil kumar poka

|

Sep 01, 2019 | 1:54 PM

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు డా. సౌందరరాజన్ నియమితులయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీ చీఫ్ గా ఈమె పదవీకాలం డిసెంబరుతో ముగుస్తోంది. దీంతో ఆమెను కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించింది. తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టకముందు కూడా సౌందరరాజన్ పార్టీకి విశేష కృషి చేశారు. 1999 లో సౌత్ చెన్నై డిస్ట్రిక్ట్ మెడికల్ విభాగం కార్యదర్శి స్థాయి నుంచి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. 2014 ఆగస్టులో ఆమెను ఈ పదవిలో నియమించారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఈమె కాంగ్రెస్ నేత కుమారి అనంతన్ కుమార్తె. కాంగ్రెస్ ఎంపీ హెచ్.వసంతకుమార్ మేనకోడలు. ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఏదీ లేనప్పటికీ సౌందరరాజన్.. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఆ తరువాత తమిళనాట కమలం పార్టీ చీఫ్ గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ గా తన నియామకంపై స్పందించిన ఆమె.. ఇందుకు భగవంతునికి, ఈ దేశ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి గుర్తింపు ఉంటుందని పీఎం మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన నియామకం ద్వారా నిరూపించారని పేర్కొన్నారు. తమిళనాడులో ఇటీవల 43 లక్షల మంది పార్టీలో సభ్యులుగా చేరారని చెప్పిన ఆమె.. తన వయస్సుతో నిమిత్తం లేకుండా పార్టీ నాయకులు తనకీ అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ విజయాన్ని పార్టీలో ప్రతి ఒక్కరికి, తమిళనాడు ప్రజలకు, నా తలిదండ్రులకు అంకితం చేస్తున్నా అని సౌందరరాజన్ చెప్పారు. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు పార్లమెంటరీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఈమె ఓడిపోయారు. తెలంగాణ గవర్నర్ గా ఈమె నియమితులు కావడంతో ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ గా కొత్త వ్యక్తిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu