ముప్పై ఏళ్ళ నుంచి ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. జాగ్రత్త!

వాహనదారులారా జర జాగ్రత్త.. రోడ్డు మీదకు వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్, బండి పేపర్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీ జేబు ఖాళీ అవ్వక తప్పదు. ఆగష్టు 9న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మోటార్ వాహనాల(సవరణ) చట్టం ప్రకారం ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నియమ నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కొత్త రూల్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. యాక్సిడెంట్లు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా 30 ఏండ్ల క్రితం నాటి మోటారు వాహనాల […]

ముప్పై ఏళ్ళ నుంచి ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. జాగ్రత్త!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 01, 2019 | 7:25 AM

వాహనదారులారా జర జాగ్రత్త.. రోడ్డు మీదకు వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్, బండి పేపర్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీ జేబు ఖాళీ అవ్వక తప్పదు. ఆగష్టు 9న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మోటార్ వాహనాల(సవరణ) చట్టం ప్రకారం ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నియమ నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కొత్త రూల్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. యాక్సిడెంట్లు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా 30 ఏండ్ల క్రితం నాటి మోటారు వాహనాల చట్టం 1989లో సవరణలు చేసి మోటారు వాహనాల(సవరణ) బిల్లు – 2019ను రూపొందించారు. ఇక ఈ బిల్లు ఆమోదంతో గతంలో ఉన్న జరిమానాలు ఎవరూ ఊహించనంత రీతిలో భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈరోజు నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తుండగా.. తెలంగాణాలో మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత అమలు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అప్పుడెప్పుడో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎలా భారీ జరిమానాలు విధిస్తారో.. సరిగ్గా అదే మాదిరిగా ఇవాళ్టి నుంచి వసూళ్లు చేయనున్నారు. వాహనదారులు ఇకపై రోడ్డు మీద బండి నడపాలంటే ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పోలీసులు కఠిన చర్యలు.. అంతేకాకుండా భారీ జరిమానాలు విధించి జేబులు ఖాళీ చేస్తారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ధ్యేయంగా వాటికి  సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు.  దీని ప్రకారం ఇకనుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఈ రూల్‌ను అతిక్రమిస్తే.. రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

అధిక లోడ్తో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకున్నా.. ఒక్కో ప్రయాణికుడి చొప్పున రూ.200 జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు.

సీటు బెల్ట్ ధరించకపోతే.. రూ.1000 జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు పోలీస్ అధికారులు కొత్త చట్టం ద్వారా కఠినమైన నిబంధనల విషయంలో చర్యలు తీసుకోనున్నారు. కాగా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లఘించే వాహనదారులకు విధించే అపరాధ రుసుం వివరాలను ఓసారి పరిశీలిస్తే…

* హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే… కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా మూడు నెలల పాటు లైసెన్సు రద్దు చేస్తారు. * మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు) * సీటుబెల్టు పెట్టుకోకుండా కారునడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100) * డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500) * రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100) * అతివేగం తో వాహనం నడిపితే రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400) * ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000) * అంబులెన్స్ ల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు) * వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000) * పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000) * త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200) * సెల్‍‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి) * మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు అపరాధం. ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.