తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ.. !
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే నరసింహన్ స్థానంలో తిరిగి ఎవరిని నియమించాలన్నదానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యక్తిని కానీ లేదా కేరళ గవర్నర్ సదాశివంను కానీ నరసింహన్ స్థానంలో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న […]
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అయితే నరసింహన్ స్థానంలో తిరిగి ఎవరిని నియమించాలన్నదానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యక్తిని కానీ లేదా కేరళ గవర్నర్ సదాశివంను కానీ నరసింహన్ స్థానంలో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల రాజ్‌భవన్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా మార్పుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ.. కేంద్రం ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన రికార్డు నరసింహన్ కు దక్కుతుంది. అంతేకాదు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ గా కూడా ఆయన గుర్తింపు పొందారు.