‘సారే జహాసే అచ్ఛా’… ఆలపించిన అల్టాఫ్ హుస్సేన్!
జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పాక్ నేతలు అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఇటువంటి సమయంలో పాకిస్తాన్‌లోని ప్రముఖ పార్టీ ‘ముత్తహిదా ఖామి మూవ్‌మెంట్’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హస్సేన్ చేసిన ఓ పని చర్చనీయాంశమైంది. లండన్‌లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కసారిగా ‘సారే జహాసే అచ్ఛా.. హిందూ సితా హమారా..’ అంటూ పాడసాగారు. దీంతో ఆ […]
జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పాక్ నేతలు అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఇటువంటి సమయంలో పాకిస్తాన్‌లోని ప్రముఖ పార్టీ ‘ముత్తహిదా ఖామి మూవ్‌మెంట్’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హస్సేన్ చేసిన ఓ పని చర్చనీయాంశమైంది. లండన్‌లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కసారిగా ‘సారే జహాసే అచ్ఛా.. హిందూ సితా హమారా..’ అంటూ పాడసాగారు. దీంతో ఆ సమావేశానికి హాజరైన వారే కాదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకయ్యారు. దాంతో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
#WATCH London: Founder of Pakistan’s Muttahida Qaumi Movement (MQM) party, Altaf Hussain sings 'Saare jahan se acha Hindustan hamara.' pic.twitter.com/4IQKYnJjfB
— ANI (@ANI) August 31, 2019