అయోధ్య విచారణ వేగవంతం… నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు!

డెబ్బై ఏళ్లుగా రగులుతున్న అయోధ్య వివాదానికి మరో మూడు నెలల్లో తెరపడనుందా? రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం నవంబర్‌లో తుది తీర్పు వెలువరించనుందా? అంటే న్యాయవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. […]

అయోధ్య విచారణ వేగవంతం... నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు!
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 5:05 AM

డెబ్బై ఏళ్లుగా రగులుతున్న అయోధ్య వివాదానికి మరో మూడు నెలల్లో తెరపడనుందా? రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం నవంబర్‌లో తుది తీర్పు వెలువరించనుందా? అంటే న్యాయవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. న్యాయవాదుల వాదనలను ఓ వైపు సావధానంగా వింటూనే.. ఒకే వాదనను పలుమార్లు చెప్పకుండా నిలువరిస్తున్నది. ఈ విధంగా కేసు విచారణలో గణనీయ పురోగతి సాధించింది. ఇప్పటికే హిందూ కక్షిదారుల వాదనలను పూర్తిచేసింది. రామ్‌ లల్లా, నిర్మోహి అఖారా, ఆలిండియా రామ్‌ జన్మస్థాన్‌ పునరుత్థాన్‌ సమితి, 1951లో తొలి వ్యాజ్యం దాఖలు చేసిన గోపాల్‌ సింగ్‌ విశారద్‌ వారసుడితోపాటు షియా వక్ఫ్‌బోర్డు వాదనలను ముగించింది.

వివాదం నెలకొన్న 2.77 ఎకరాల భూమిని రామ్‌లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు సమానంగా (మూడింట ఒక వంతు చొప్పున) పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు గతంలో తీర్పును వెలువరించింది. ఇందులో రామ్‌లల్లా, నిర్మోహి అఖారా తరఫున సుప్రీంకోర్టులో వాదనలు పూర్తికాగా, సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున వాదనలు మాత్రమే మిగిలాయి. సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ వాదనలు వినిపించనున్నారు. అయోధ్య కేసుపై వారంలో ఐదు రోజులపాటు విచారణ చేపట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. సీజేఐ గొగోయ్‌ నవంబర్‌ 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అయోధ్య వివాదంపై ఆలోగా తుదితీర్పు వెలువడనుందా అన్నదానిపై కోర్టులో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వివాదాస్పద స్థలంలో మూడింట రెండు వంతుల భూమి కలిగిన కక్షిదారుల వాదనలను కోర్టు ఇప్పటికే పూర్తిచేసిన నేపథ్యంలో నవంబర్‌లోగా తీర్పు వెలువడడం సాధ్యమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వాదనలు పూర్తి చేయడానికి తనకు 20 రోజుల సమయం కావాలని రాజీవ్‌ ధావన్‌ గతంలో కోర్టుకు తెలిపారు. ఆయన కోరినట్లుగానే 20 రోజులపాటు వాదనలు వినిపించినా, కేసుపై తుది తీర్పు వెలువరించేందుకు కోర్టుకు నెలకుపైగా సమయం ఉంటుంది.

ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
మార్చి 4 నుంచి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన
మార్చి 4 నుంచి తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన