5

మెడికల్ డివైజెస్‌కు హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్

మెడికల్ డివైజెస్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కాబోతుందని ఆయన ట్వీట్ చేశారు. స్టెంట్ ఉత్పత్తులకు గుర్తింపు పొందిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ) ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు. సుల్తాన్‌పూర్ పార్క్‌లో ఎస్‌ఎంటీ స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ఆదివారం (సెప్టెంబర్ 1) శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ […]

మెడికల్ డివైజెస్‌కు హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 4:36 AM

మెడికల్ డివైజెస్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కాబోతుందని ఆయన ట్వీట్ చేశారు. స్టెంట్ ఉత్పత్తులకు గుర్తింపు పొందిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ) ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు.

సుల్తాన్‌పూర్ పార్క్‌లో ఎస్‌ఎంటీ స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ఆదివారం (సెప్టెంబర్ 1) శంకుస్థాపన చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఎస్‌ఎంటీ ఛైర్మన్ ధీరజ్‌లాల్ కొటాడియా, ఎండీ భార్గవ్ కొటాడియా శనివారం కేటీఆర్‌ను కలిసి యూనిట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. తొలి దశలో 250 ఎకరాల్లో మెడికల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వెయ్యికి పైగా కంపెనీలు ఈ పార్క్‌లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది.

మెడికల్ డివైజెస్ తయారీ రంగం దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కారణం అవుతోందని కేటీఆర్ చెప్పారు. ఈ రంగం అభివృద్ధి చెందడం ద్వారా ముఖ్యంగా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోతుందని ఆయన వివరించారు. ప్రధానంగా ఈ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.