AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR warning : కల్తీ విత్తనాల తయారీ దారులతో వ్యవసాయ అధికారులు కుమ్మక్కైతే ఆక్షణమే ఉద్యోగం లోంచి డిస్మిస్.. ఐదేళ్ల జైలు : కేసీఆర్

కల్తీ విత్తనాలు కొని నాటేస్తే రైతు అన్నితీర్లా నష్టపోతడు. విత్తనం నాటి పంటను ఖర్చు చేసి పెంచుకోని తీరా కాతకాసే ముందు నిలబడి పోతే వూహించని పరిణామానికి గుండె బలిగి హతాశులైపోతరు..

KCR warning : కల్తీ విత్తనాల తయారీ దారులతో వ్యవసాయ అధికారులు కుమ్మక్కైతే ఆక్షణమే ఉద్యోగం లోంచి డిస్మిస్.. ఐదేళ్ల జైలు : కేసీఆర్
KCR -
Venkata Narayana
|

Updated on: May 29, 2021 | 11:28 PM

Share

Selling spurious seed : కల్తీ విత్తనాల తయారీ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ అధికార్లను ఆదేశించారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సీఎం కేసీఆర్ ఇవాళ ఉన్నతాధికారులతో చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సీఎం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని.. కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీలతో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని డీజీపీకి ఫోన్లో సీఎం ఆదేశించారు. నిఘా వర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సీఎం ఆదేశించారు. “ఇగ మీరు నర్సింహావతారం ఎత్తాలె. దొరికినోన్ని దొరికినట్టే పట్టుకొని పిడీయాక్టు పెట్టాలె. ఇగ తెలంగాణల కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేటట్టు మీ చర్యలుండాలె. కల్తీ విత్తనాల మీద యుద్దం ప్రకటించాలె ” అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కల్తీ విత్తనాలతో రైతన్నకు తీరని నష్టమని చెప్పిన కేసీఆర్.. సన్న.. చిన్నకారు రైతు ఒకటి రెండు ఎకరాలమీద ఆధారపడి కుటుంబాన్ని సాదుకుంటడని, అటువంటి రైతును కల్తీ విత్తనాలతో మోసం చేయడం అంటే దుర్మార్గమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “కల్తీ విత్తనాలు కొని నాటేస్తే రైతు అన్నితీర్లా నష్టపోతడు. విత్తనం నాటి పంటను ఖర్చు చేసి పెంచుకోని తీరా కాతకాసే ముందు నిలబడి పోతే వూహించని పరిణామానికి గుండె బలిగి హతాశులైపోతరు..” అని సీఎం అన్నారు. ఇందుకు కారణమయ్యే కల్తీ విత్తనదారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని స్పష్టం చేశారు. “డేగ కన్నుతో కనిపెడుతూ కల్తీ విత్తనదారులు తప్పించుకోలేని విధంగా చక్రవ్యూహం పన్నాలె విత్తనాలనే కాకుండా ఫెర్టిలైజర్లు కూడా కల్తీ కావడం దుర్మార్గం. బయో ఫెస్టిసైడ్ల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలను కూడా పట్టుకోని పీడి యాక్టు పెట్టాలె.. అని సీఎం ఆదేశించారు.

కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలన్నారు కేసీఆర్. ఒకవేల వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజవైతే వారిని ఆక్షణమే ఉద్యోగం లోంచి తొలగించడమే కాకుండా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూడాలన్నారు. “వ్యవసాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలె. ప్రేక్షక పాత్ర వహించకుండా కల్తీలను పసిగట్టి నియంత్రించాలె. దీనికి జిల్లా వ్యవసాయధికారి అసిస్టెంట్ డైరక్టర్లు బాధ్యత వహించాలె. వారి వారి జిల్లాల్లో పర్యటించాలె. కల్తీకి అలువాటు పడిన ముఠాలను గుర్తించి పీడీ యాక్టు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలె. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్సీలు కమిషనర్లు సమీక్షలు నిర్వహించాలె”. అని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.

Read also : Paddy Grain : నాలుగైదు రోజుల్లో ధాన్యం సంపూర్ణ సేకరణ జరుపుతాం.. భయాందోళనలకు గురికావద్దు..ఆగమాగం కావద్దు. : సీఎం