AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆంధ్రా అబ్బాయి.. మధ్యప్రదేశ్‌ అమ్మాయి.. ఇద్దరూ కలిసి ఓయో రూమ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి, మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.. ఇద్దరూ ఒకరినొకరు మనసు పడ్డారు.. మనసులు కలవడంతో.. ఇద్దరూ పెద్ద ప్లానే రచించారు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.. దాని కోసం గంజాయ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.. అయితే.. దొరకకుండా ఉండేందుకు ఓయో రూమ్‌లను ఎంచుకున్నారు..

Hyderabad: ఆంధ్రా అబ్బాయి.. మధ్యప్రదేశ్‌ అమ్మాయి.. ఇద్దరూ కలిసి ఓయో రూమ్‌లో..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 19, 2025 | 11:24 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి, మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.. ఇద్దరూ ఒకరినొకరు మనసు పడ్డారు.. మనసులు కలవడంతో.. ఇద్దరూ పెద్ద ప్లానే రచించారు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.. దాని కోసం గంజాయ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.. అయితే.. దొరకకుండా ఉండేందుకు ఓయో రూమ్‌లను ఎంచుకున్నారు.. ఓయో రూమ్స్‌లో ఉంటూ గంజాయి వ్యాపారం ప్రారంభించారు.. చివరకు అసలు గుట్టు బయటకు రావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. ఓయో రూమ్స్ లో ఉంటూ ఇద్దరూ చేస్తున్న దందాను రట్టు చేశారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.. కొండాపూర్‌లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి దందా చేస్తున్న యువతీ, యువకుడిని ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు..

ఎస్టీఎఫ్‌ అధికారి నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేందుల రాజు (25) కు మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా (18) తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఓయోరూమ్స్‌లో గదులు అద్దెకు తీసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు.

కొంతకాలంగా కొండాపూర్‌లోని ఓయో రూంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం రాత్రి ఎస్టీఎఫ్‌ బృందం తనిఖీలు నిర్వహించి అసలు గుట్టును రట్టుచేసింది.. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ నుంచి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..