Amit Shah: ఇవాళే సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్.. పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై అమిత్ షా.. బీజేపీ నేతలతో చర్చించారు. చర్చించారు.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకున్న అమిత్ షాకు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు. తర్వాత పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్‌ఛుగ్‌తో విడిగా సమావేశం అయ్యారు షా. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై అమిత్ షా.. బీజేపీ నేతలతో చర్చించారు. చర్చించారు. అయితే, ఇవాళ షెడ్యూల్ కార్యక్రమాల తర్వాత తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు.
అమిత్ షాను కలిసిన బండి సంజయ్.. జగిత్యాల మాజీ చైర్మన్ శ్రావణిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఇటీవల ఆమె, ఎమ్మెల్యే సంజయ్‌పై ఆరోపణలు చేసి బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రత్యేకంగా పరిచయం చేశారు సంజయ్.




Received Hon’ble Minister of Home Affairs & Cooperation Shri @AmitShah ji on arrival at the Hakimpet Air Force Station in Hyderabad. pic.twitter.com/NZWbgaKw8d
— G Kishan Reddy (@kishanreddybjp) March 11, 2023
సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌కి అంతా సిద్ధం..
ఇక ఇవాళ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌కి అంతా సిద్ధమైంది. ప్రస్తుతం అమిత్ షా.. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ-నిసాలో బస చేస్తున్నారు. ఏడున్నర తర్వాత మొదలయ్యే రైజింగ్ డే పెరేడ్‌లో ఆయన పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
