AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌‌లో ట్యాబ్ ఆర్డర్ చేశారు.. కట్ చేస్తే, పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..

కాలం మారింది.. అరచేతిలో ప్రపంచం.. ఏది కావాలన్నా.. ఏ వస్తువు మన దగ్గరకు రావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమే.. అలా బుక్ చేయడమే ఆలస్యం.. ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తుంది.. కానీ.. ఇక్కడ ఇంకో విషయం ఉంది.. అసలా..? నకిలీనా..? తక్కువ ధరకు లభిస్తుంది అంటే.. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే..

ఆన్‌లైన్‌‌లో ట్యాబ్ ఆర్డర్ చేశారు.. కట్ చేస్తే, పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..
Tab Replaced With Lifebuoy
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 14, 2025 | 8:41 PM

Share

కాలం మారింది.. అరచేతిలో ప్రపంచం.. ఏది కావాలన్నా.. ఏ వస్తువు మన దగ్గరకు రావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడమే.. అలా బుక్ చేయడమే ఆలస్యం.. ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తుంది.. కానీ.. ఇక్కడ ఇంకో విషయం ఉంది.. అసలా..? నకిలీనా..? తక్కువ ధరకు లభిస్తుంది అంటే.. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే.. తొందరపడి బుక్ చేశామో అంతే సంగతులు.. ఫైనల్‌గా మనం మోసపోయినట్లే.. అలా.. ఆన్‌లైన్‌లో ఓ వస్తువు ఆర్డర్ పెట్టిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది.. ట్యాబ్ ఆర్డర్ చేస్తే.. లైఫ్‌బాయ్ సబ్బులు ఇంటికొచ్చాయి.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.. వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి తన భార్య కోసం ట్యాబ్‌ను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాడు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చినటువంటి ఆర్డర్ ఓపెన్ చేయగా అందులో ట్యాబ్ కి బదులు లైఫ్ బాయ్ సబ్బులు కనిపించాయి.. దీంతో కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు.

తన భార్య యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటుందని సుబ్బారావు అనే వ్యక్తి అమెజాన్ లో ఓ ట్యాబ్ (tab) ని బుక్ చేశాడు.. ఆ tab ధర 18,000.. మూడు రోజుల తర్వాత అమెజాన్ నుంచి ఓ ఆర్డర్ వచ్చింది.. సరే, ఆర్డర్ పెట్టిన టాబ్ ఆర్డర్ వచ్చిందని సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు సుబ్బారావు… తీరా ఆర్డర్నీ ఓపెన్ చేసి చూడగా షాక్ కి గురయ్యారు..

వీడియో చూడండి..

ఆర్డర్ బాక్స్‌లో నాలుగైదు లైఫ్ బాయ్ సబ్బులతోపాటు మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి బాక్సులను ఆర్డర్ ప్యాక్‌లో పెట్టారు. ఇది చూసినటువంటి కస్టమర్స్ ఒకసారి గా షాక్‌కి గురయ్యారు.. ఈ విధంగా గతంలో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిలో ఆర్డర్ పెట్టినటువంటి వస్తువులు స్థానంలో ఇతర వస్తువులను పెట్టి కస్టమర్లను మోసాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి.. దీనిపై ఫిర్యాదు చేస్తామని కస్టమర్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..