AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: టీవీ9 రిపోర్టర్ రంజిత్‌ను కలిసి సారీ చెప్పిన మోహన్ బాబు..

దాడి చేశారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసి.. సారీ చెప్పాల్సింది పోయి.. హీట్ ఆఫ్ మూమెంట్‌లో జరిగిపోయింది అని కటింగ్ ఇచ్చారు. దీంతో టీవీ9 న్యాయపోరాటం చేసింది. దీంతో మోహన్ బాబు దిగివచ్చారు.

Mohan Babu: టీవీ9 రిపోర్టర్ రంజిత్‌ను కలిసి సారీ చెప్పిన మోహన్ బాబు..
Reporter Ranjith - Mohan Babu
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2024 | 5:14 PM

Share

టీవీ9 న్యాయపోరాటానికి నటుడు మోహన్‌బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు.  నా రూటే సెపరేటు.. నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్‌బాబు.. టీవీ9 న్యాయపోరాటానికి దిగివచ్చారు. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబు టీవీ9కు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.  దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు.

Mohan Babu With Ranjith Family

Mohan Babu With Ranjith Family

అసలు ఏం జరిగింది..?

ఇటీవల మోహన్ బాబు ఇంట వివాదానికి సంబంధించి న్యూస్ కవర్ చేస్తున్న టీవీ9 ప్రతినిధి రంజిత్ పై అకారణంగా దాడికి దిగారు మోహన్ బాబు. ఇంట్లో చెలరేగిన రచ్చతో విచక్షణ కోల్పోయి.. మీడియాపై దాడికి తెగబడ్డారు. అవతల ఉన్నది తనలాంటి మనిషే అన్న ఇంగితం కూడా లేకుండా ప్రవర్తించారు. 20, 30 కెమెరాల సాక్షిగా టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ చేతిలో ఉన్న మైక్‌ను బలవంతంగా లాక్కుని.. ఎముకలు విరిగేలా కొట్టారు. దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ టీవీ9 ప్రతినిధిపై దాడి చేశారు.

టీవీ9 ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు తీరుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రజా సంఘాలు, రాజకీయ ప్రముఖులు టీవీ9కు అండగా నిలబడ్డారు. మోహన్‌ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్‌ సంఘాలు, రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండించారు. అయ్యప్ప మాలలో ఉన్న రంజీత్‌పై దాడి జరగడంతో అయ్యప్ప భక్తులు కూడా రోడ్డెక్కారు.

దీంతో మోహన్‌బాబుపై పోలీసులు యాక్షన్‌కు దిగారు. మోహన్‌బాబుపై హత్యయత్నం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్‌ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. అరెస్ట్‌ భయంతోనే అజ్ఞాతవాసిలా మారారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మోహన్‌బాబు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికి వెళ్లలేదు… ఇంట్లోనే ఉన్నానంటూ పరారీ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నానంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారాయన.

మరోవైపు, మోహన్‌బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌‌కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. తీవ్రంగా దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను డాక్టర్ల బృందం సరిచేసింది. ఫ్రాక్చర్‌ అయినచోట స్టీల్‌ ప్లేట్‌ అమర్చారు. మరో మూడు నాలుగు రోజులపాటు వైద్యుల అబ్జర్వేషన్‌లోనే ఉండనున్నారు. మోహన్‌బాబు దాడిలో రంజిత్‌కి మూడుచోట్ల జైగోమాటిక్ ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. కంటికి, చెవికి మధ్య ఫ్రాక్చర్‌ కావడంతో 3 గంటలపాటు సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు వైద్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..