AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటిమామిడి అడవిలో ప్రేయసిని వదిలి వెళ్లిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఆ ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కానీ మతాలు వేరు కావడంతో కన్నోళ్లు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. ఈ క్రమంలో కొత్త జంట మధ్య మనస్పర్ధలు వచ్చాయి. మనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడితే ఇదే అదనుగా ప్రేమించిన వాడు ఆమెను అర్ధరాత్రి కారులో తీసుకొచ్చా అడవిలో వదిలెళ్లాడు..

వంటిమామిడి అడవిలో ప్రేయసిని వదిలి వెళ్లిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Vantimamidi Forest
Srilakshmi C
|

Updated on: Dec 15, 2024 | 6:29 PM

Share

ములుగు, డిసెంబర్‌ 15: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అడవిలో ఓ యువతి స్పృహ తప్పిన స్థితిలో స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తి కారులో తీసుకొచ్చి ఆమెను అక్కడ వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ములుగు ఎస్సై విజయ్‌ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ అనే యువకుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విక్రమ్‌ మన్వర్‌ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో రబియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరు ఏడాది జనవరి నుంచి సహజీవనం చేశారు. అనంతరం రబియా తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఈనెల 4న బెంగుళూరులోని ఒక దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవ పడుతున్నారు. మరోవైపు విక్రమ్ కుటుంబం సంపన్న అమ్మాయితో పెళ్లి కుదిర్చడంతో అతను ఆ పెళ్లిని తిరస్కరించాడు.

ఇవి కూడా చదవండి

అతని కుటుంబ సభ్యులు రబియాను వివాహం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, విక్రమ్ ఆమెను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. విక్రమ్ కుటుంబం రజియాను కోడలిగా అంగీకరించకపోగా… ఆమెను వదిలేయాలంటూ బలవంతం చేయసాగారు. ఈ క్రమంలో విక్రమ్, రబియాకు గొడవలు ప్రారంభమయ్యాయి. విక్రమ్‌ ఆమెను విషయం తాగి మరణించమని చెప్పాడు. తనను నమ్మించి మోసం చేశాడన్న మనస్తాపంతో రబియా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. నిద్రమాత్రల ప్రభావంతో రబియా స్పృహ కోల్పోగా విక్రమ్‌ ఆమెను కారులో సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి, అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రంగా అడవిలో ఒంటరిగా ఉన్న రబియాను ఉదయం కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమెను రక్షించి వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరిట తనను విక్రమ్‌ మోసం చేశాడని రబియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న విక్రమ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రబియా ఆరోగ్యం బాగానే ఉందని, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.