AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad:ఓర్నీ మీ దుంపతెగ.. మీరెక్కడ తగిలార్రా బాబు.. నడిరోడ్డుపై మందుబాబు వీరంగం

హైదరాబాద్‌లో ఓ యువకుడు నడిరోడ్డుపై నానా హంగామా చేశాడు. ఫుల్లుగా గంజాయి సేవించి రోడ్డుపై హైడ్రామా క్రియేట్ చేశాడు. కాసేపు కింద కూర్చుంటాడు.. కాసేపు లేచి అటు ఇటు తిరుగుతాడు. అంతటితో ఆగకుండా బస్సు, కారు, బైకు అనే తేడా లేకుండా అడ్డం వచ్చిన అన్ని వాహనాలను నిలువరిస్తూ నానా హంగామా సృష్టించాడు.

Hyderabad:ఓర్నీ మీ దుంపతెగ.. మీరెక్కడ తగిలార్రా బాబు.. నడిరోడ్డుపై మందుబాబు వీరంగం
Hyderabad News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Dec 01, 2024 | 10:05 AM

Share

మత్తులో మునిగితే ప్రపంచాన్నే మరిచిపోతారు కొందరు.. ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. మన వల్ల పక్కవాళ్ల ఇబ్బంది పడుతున్నారేమో అని కనీస విచక్షణ కూడా ఉండదు అలాంటివాళ్లకు.. దానికి తోడు ఈ మధ్య మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు కలిగించే వాటిని సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వాటికి బానిసలు అవుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువైంది. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే ఓ గంజాయి మహానుభావుడు చేసిన నిర్వాకం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు.

హైదరాబాద్ పాతబస్తీ చంపాపేట్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఫుల్లుగా గంజాయి సేవించాడు. ఇంకేముంది.. ఎవడు నాకు అడ్డు అన్నట్లుగా నడిరోడ్డుపైనే దుకాణం పెట్టేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అంత ట్రాఫిక్ మధ్య అతనికి ఏమైనా జరుగుతుందేమో అని మనం భయపడడం తప్ప.. ఆ మహానుభావుడు మాత్రం భయం లేకుండా రోడ్డుపై హైడ్రామా క్రియేట్ చేశాడు. కాసేపు కింద కూర్చుంటాడు.. కాసేపు లేచి అటు ఇటు తిరుగుతాడు. అంతటితో ఆగకుండా బస్సు, కారు, బైకు అనే తేడా లేకుండా అడ్డం వచ్చిన అన్ని వాహనాలను నిలువరిస్తూ నానా హంగామా సృష్టించాడు. పోనీ ఎవరైనా నచ్చజెప్పినా వినే పరిస్థితిలో అతను లేనట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికి ఎంత ఇబ్బంది కలిగించినా.. ఆ వ్యక్తి కంట పడకుండా మెల్లగా అక్కడ నుంచి జారుకోవడం తప్ప చేసేదేమీ లేదనుకున్నారేమో.. ఎవ్వరు కూడా అతన్ని ఆపి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో పాటు చాలా మంది వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. పైగా అక్కడ ఉండి కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ సిబ్బంది కూడా కనబడకపోవడం గమనార్హం. అందుకే ఆ గంజాయి మహానుభావుడు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా కనిపించిది అక్కడ పరిస్థితి..

వీడియో ఇదిగో: