AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృతి..

వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో ముత్తంగి దాబాలో భోజనం చేద్దామని బయలు దేరారు. ఇందులో భాగంగానే సుల్తాన్‌పూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి కాసేపు ప్రయణించారు. అయితే సందీప్‌ రెడ్డి కుమారుడు మోక్షిత్‌ రెడ్డి (6) కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కారును రోడ్డు పక్కన ఆపారు....

Hyderabad: టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృతి..
Representative Image
Narender Vaitla
|

Updated on: Jul 26, 2024 | 6:59 AM

Share

మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరని చెబుబుతుంటారు. రెప్పపాటు వేగంలోనే మరణం పలకరిస్తుంటుంది. అసలు ఊహకు కూడా అందని విధంగా ప్రాణాలు పోతుంటాయి. తాజాగా హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌పై ఇలాంటి ప్రమాదమే జరిగింది. సరాదాగా భోజనం చేద్దామని దాబాకు బయలు దేరిన ఓ కుటుంబంలో విషాధం నిండింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ టైర్‌ ఆరేళ్ల చిన్నారిని బలి తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆదివారం కుటుంబ సభ్యులతో ముత్తంగి దాబాలో భోజనం చేద్దామని బయలు దేరారు. ఇందులో భాగంగానే సుల్తాన్‌పూర్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి కాసేపు ప్రయణించారు. అయితే సందీప్‌ రెడ్డి కుమారుడు మోక్షిత్‌ రెడ్డి (6) కాసేపటికే మూత్ర విసర్జన కోసం అడగ్గా కారును రోడ్డు పక్కన ఆపారు. అనంతరం బాలుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలోనే ఎక్కడి నుంచో ఓ టైర్‌ అత్యంత వేగంగా దూసుకొచ్చింది.

అంతలోనే ఆ బాలుడిని ఒక్కసారిగా బాలుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమాంతం దూరంగా పడ్డాడు మోక్షిత్‌. తీవ్ర గాయాలైన మోక్షిత్‌ను తల్లిద్రండులు వెంటనే ముత్తంగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో మరో ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లాలని వైద్యుడు సూచించాడు. దీంతో హుటాహుటిన మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు. అయితే తీవ్ర గాయం కారణంగా బాలుడు చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. అయితే ఆ టైర్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఓఆర్‌ఆర్‌పై ఏదైనా వాహనం టైర్‌ ఊడిపోయి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!