Watch: మా కూతురిని తీసుకురండి.. చికాగో రోడ్లపై ఆకలితో హైదరాబాదీ యువతి.. మంత్రి జైశంకర్‌కు యువతి తల్లి కన్నీటిలేఖ..

| Edited By: Sanjay Kasula

Jul 27, 2023 | 8:26 PM

USA News: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువతి సామాన్లన్నీ పోగొట్టుకుని వీధిన పడింది. ఆమెను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Watch: మా కూతురిని తీసుకురండి.. చికాగో రోడ్లపై ఆకలితో హైదరాబాదీ యువతి.. మంత్రి జైశంకర్‌కు యువతి తల్లి కన్నీటిలేఖ..
Hyderabad Woman
Follow us on

హైదరాబాద్ మౌలాలిలో నివాసం ఉంటున్న ఫాతిమా. ఈమె కూతురు జైధి.. అమెరికాలో ఎమ్మెస్ చదివేందుకు 2021లో అమెరికాకు వెళ్ళింది. యూఎస్ లోని డిట్రైట్ లోని ట్రిన్ యూనివర్సిటీ లో ఎమ్ ఎస్ సీటు వచ్చింది.. అయితే గత రెండు నెలల నుండి తమ కూతురు తమకు టచ్ లో లేదని తల్లి తల్లడిల్లి పోతుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకుల ద్వారా తమ కూతురి దయనీయ స్థితిపై తనకు తెలిసిందనీ తల్లి తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా సరే తనను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని వేడుకుంటుంది. ఈ విషయంపై విదేశాంగ మంత్రి జయశంకర్ కు సైతం తల్లి ఫాతిమా లేఖ రాసింది. తన కూతురి దయనీయ పరిస్థితిని వివరిస్తూ తమకు సహాయం చేయాల్సిందిగా కేంద్రమంత్రిని కోరింది.

ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళిన తన కూతురి పరిస్థితిని కేంద్రమంత్రి కి వివరించింది. కొన్ని నెలల క్రితం తన సామాన్లను అపహరించడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. మరి కొంతమంది తనని హాస్పిటల్ లో చూపిస్తామని చెప్పి ఆమెనుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు… ఈ విషయాలన్నీ అమెరికాలో ఉన్న జైది తో మాట్లాడించి వీడియోను హైదరాబాదులో ఉన్న ఆమె తల్లి ఫాతిమాకు పంపించారు ఇద్దరు యువకులు.

ఇవి కూడా చదవండి

రంగంలోకి దిగిన ఇండియన్ ఎంబసీ

భారతీయ విద్యార్థి దయనీయ పరిస్థితిపై అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చిన యువతి ఆకలి చావుల మధ్య అమెరికా వీధిలో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనపై వీలైనంత త్వరగా వివరాలు రాబట్టి సహాయం చేస్తామంటూ ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ ట్వీట్ తో ఈ ఘటన బయటికి వచ్చింది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం