Telangana: పాన్‌షాపుల్లో నిషేధిత విదేశీ సిగరెట్లు.. అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు

పాత రోజుల్లో పాన్ షాపులు అంటే ఒక చిన్న డబ్బా కొట్టు లాగా ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ షాపులు అంటే కలర్‎ఫుల్ లైట్స్‎తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా పాన్ షాప్ లో పాన్, సిగరెట్టు దొరుకుతాయి.

Telangana: పాన్‌షాపుల్లో నిషేధిత విదేశీ సిగరెట్లు.. అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు
Accused
Follow us
Sravan Kumar B

| Edited By: Aravind B

Updated on: Jul 27, 2023 | 8:18 PM

పాత రోజుల్లో పాన్ షాపులు అంటే ఒక చిన్న డబ్బా కొట్టు లాగా ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ షాపులు అంటే కలర్‎ఫుల్ లైట్స్‎తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా పాన్ షాప్ లో పాన్, సిగరెట్టు దొరుకుతాయి. కానీ కొన్ని కొన్ని పాన్ షాపుల్లో పాన్లు, సిగరెట్ల తో పాటు, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అంటూ పెర్ఫ్యూమ్ లు, కీ చైన్లు, చాక్లెట్లు, లైటర్స్ ఇలా రకరకాల ఐటమ్స్ తో కష్టమర్స్ ని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ షాపుల కేంద్రంగా స్మగ్లింగ్ వస్తువులు అమ్ముతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే కొన్ని పాన్ షాపుల్లో కాదు హైదరాబాద్ లో మొత్తంగా అన్ని పాన్ షాపుల్లో నిషేధించబడిన విదేశీ సిగరెట్లు రహస్యంగా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా సప్లై అవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో వీటిపై దాడి చేసి స్మగ్లింగ్ చేసి అమ్ముతున్న వివిధ రకాల సిగరెట్లను పోలీసులు కూడా సీజ్ చేశారు. కానీ వాటి రవాణా అని మాత్రం అరికట్టలేకపోతున్నారు.

స్మగుల్డ్ సిగరెట్లు మాత్రమే కాదు నిషేధించబడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకాలు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. చైనా నుంచి ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం ఈ సిగరెట్ల బిజినెస్ విస్తరించింది. హైదరాబాద్‎లో కూడా 90% పాన్ షాపుల్లో ఈ సిగరెట్‎లు బాహాటంగానే అమ్ముతున్నారు. ఈ సిగరెట్లలో రకరకాల టెస్టులతో, రకరకాల ఫ్లేవర్లతో, రీఫిల్ చేసుకుని యూస్ చేసే విధంగా అమ్ముతున్నారు. నిషేధించబడిన ఈ సిగరెట్లు, స్మగుల్డ్ సిగరెట్లతో పాటు ప్రమాదకరమైన హుక్కా ఫ్లేవర్లు కూడా అమ్ముతున్నారు. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. అయితే ప్రమాదకరమైన ఈ సిగరెట్లకి ఎక్కువగా యువత బానిసలు అవుతున్నారు. క్షేత్రస్థాయిలో వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాడులు చేస్తే తప్పితే నగరంలో యువతను ఈ డేంజర్ సిగరెట్ల నుంచి రక్షించటం సాధ్యం కాదనేది వాస్తవం.

ఇవి కూడా చదవండి