AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నమ్మి అప్పజెప్పినందుకు.. ఇంత దారుణమా..? ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించింది..!

ఓ మహిళను హత్య చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది మరో కిలాడీ లేడీ. సంఘటనా స్థలాన్ని లైంగిక దాడి సీన్‌గా మార్చింది.

Hyderabad: నమ్మి అప్పజెప్పినందుకు.. ఇంత దారుణమా..? ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించింది..!
Murder Case
Noor Mohammed Shaik
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 06, 2024 | 5:40 PM

Share

ఓ మహిళను హత్య చేసి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది మరో కిలాడీ లేడీ. సంఘటనా స్థలాన్ని లైంగిక దాడి సీన్‌గా మార్చింది. ఎట్టకేలకు మాయ లేడీని అరెస్ట్ చేసిన కూకట్‌పల్లి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలోని యేడేపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక(20) అనే మహిళ కేపీహెచ్‌బీలో వ్యభిచారం చేస్తూ, రాత్రుళ్ళు ఫుట్ పాత్ పై నిద్రించేది. అదే సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

రోడ్డుపై ఉంటున్న తనకు భద్రత లేదని, తన వద్ద ఉన్న వెండి ఆభరణాలు మంజుల వద్ద భద్రపరిచింది. కొద్ది రోజులకు తన వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని ప్రియాంక కోరగా, మంజుల వెనక్కి ఇవ్వకపోవడంతో.. ప్రియాంక మంజులను అంతు చూస్తానని బెదిరించి వెండి ఆభరణాలు తిరిగి తీసుకుంది. తనకు ప్రియాంకతో, ప్రాణహాని ఉందని భావించిన మంజుల, ఆమెకు సెప్టెంబర్ 30వ తేదీన మద్యం తాగించి, కేపీహెచ్‌బీ లోధా అపార్ట్‌మెంట్స్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్ళి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. ఆపై ప్రియాంకను ఎవరో అత్యాచారం చేసి హతమార్చినట్లుగా సీన్ క్రియేట్ చేసి అక్కడి నుండి పరారయ్యింది.

ప్రియాంక మృతదేహం లభించటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు కూకట్‌పల్లి పోలీసులు. లోధా టవర్స్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత మంజుల కదలికలను గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరిపారు పోలీసులు. పథకం ప్రకారం మంజుల నిర్మాణస్య ప్రాంతానికి ప్రియాంకను తీసుకువెళ్లి తన వెంట తీసుకువచ్చిన ప్లేట్లతో ఆమెను తీవ్రంగా గాయపరిచి హతమార్చినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఆ తర్వాత మరుసటి రోజు అక్కడికి వెళ్లి అత్యాచారం సీన్ క్రియేట్ చేసింది. ప్రియాంకను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడి, హతమార్చినట్టు వదంతులు సృష్టించింది. ఆ తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులకు లభించిన కీలక క్లూ ఆధారంగా ఈ మొత్తం హత్య మిస్టరీని ఛేదించారు. కేవలం తనకున్న ప్రాణహాని కారణంగానే ప్రియాంకను మంజుల దారుణంగా హత్య చేసినట్టు తేల్చారు పోలీసులు. ఆ తర్వాత ప్రియాంకను అదుపులోకి తీసుకని కటకటాల వెనక్కి నెట్టారు కూకట్‌పల్లి పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..