Pension: అధికారుల నిర్వాకం.. భర్త బతికుండగానే భార్యకు వితంతు పెన్షన్.. ఎక్కడంటే..

Pension: తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు అధికారుల

Pension: అధికారుల నిర్వాకం.. భర్త బతికుండగానే భార్యకు వితంతు పెన్షన్.. ఎక్కడంటే..
Pension
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 02, 2021 | 10:12 PM

Pension: తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పథకం అమలులో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఆల్విన్‌లో వెలుగు చూసింది. భర్త బ్రతికి ఉండగానే.. ఓ మహిళకు వితంతు పెన్షన్ ఇస్తున్నారు అధికారులు. ఈ పెన్షన్ వ్యవహారం సదరు కుటుంబంలో పెద్ద రచ్చ లేపింది. తన కొడుకు బ్రతికుండగానే.. కోడలికి వితంతు పెన్షన్ ఇస్తారంటూ అతని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరును తూర్పారబట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఆల్విన్ కాలనీ ధరణి నగర్‌లో సుభాష్, దివ్య దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భర్త బ్రతికుండగానే.. దివ్య వితంతు పెన్షన్ అందుకుంటోంది.

ఈ వ్యవహారంపై సుభాష్ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు అసలేం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తన కొడుకు చంపేసే ప్రయత్నంలోనే.. కోడలు దివ్య ఇలా వితంతు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుందని, అధికారులు కనీసం వేరిఫికేషన్ చేయకుండా పెన్షన్ ఇచ్చేస్తున్నారని ఆరోపించింది. తన కొడుక్కి ఏం జరిగినా ప్రభుత్వానిది, ప్రభుత్వ అధికారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. తన కోడలి తల్లే వితంతు పెన్షన్ రాయించిందని, పెన్షన్ డబ్బు కోసం తన కొడుకును వేధింపులకు గురి చేస్తున్నారని సుభాష్ తల్లి ఆరోపించింది. పెన్షన్ కోసం ఇంట్లో కనిపించొద్దంటూ సుభాష్‌ను తన కోడలు, ఆమె తల్లి కలిసి టార్చర్ చేస్తున్నారని, మూడు రోజులుగా సుభాష్ ఇంటికే రాలేదని తెలిపింది. తన కొడుకు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా.. తన కోడలు దివ్య, ఆమె తల్లిదే బాధ్యత అని స్పష్టం చేసింది. అధికారుల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

Also read:

SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కి చివరి తేదీ ఎప్పుడంటే..

Hyderabad Crime News: ఏటీఎం నుంచి సరికొత్త రీతిలో దోపిడీ.. అది చూసి షాకైన బ్యాంక్ అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..

NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!