Hyderabad: భార్యను ఇంటిపై నుంచి తోసి, ఆపై కత్తితో గొంతు కోసి చంపిన కానిస్టేబుల్.. కారణమిదే..
Telangana: హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి గౌతమినగర్‌లో దారుణం జరిగింది. కానిస్టేబుల్ రాజ్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య శోభను కత్తితో మెడ కోసి.. మొదటి అంతస్తు నుండి కింద పడేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి గౌతమినగర్‌లో దారుణం జరిగింది. కానిస్టేబుల్ రాజ్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య శోభను కత్తితో మెడ కోసి.. మొదటి అంతస్తు నుండి కింద పడేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. నిందితుడు రాజ్‌కుమార్ హైకోర్ట్ లోని 4వ గేట్ వద్ద కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
హత్యకు గురైన కానిస్టేబుల్ భార్య శోభ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరిగేవని, గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి నచ్చచెప్పితే కాపురానికి పంపించామన్నారు బంధువులు. ఇప్పుడు తమ కూతురిని పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
హత్యకు కారణం ఇదే..
శోభ హత్యకు కారణం అనుమానమే అని డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు. భార్య శోభపై అనుమానంతోనే కానిస్టేబుల్ రాజు హత్య చేశాడని తెలిపారు. మొదటి అంతస్తు నుంచి తోసేసి ఆ తరువాత కత్తితో గొంతు కోసి చంపాడని అన్నారు. రెండు రోజులగా భార్య భర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయని చెప్పారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే రాజు.. శోభను హత్య చేశాడని వెల్లడించారు డీసీపీ. కానిస్టేబుల్ రాజు హైకోర్టులో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పరారీలో ఉన్న రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..