AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

హైదరాబాద్‌ మహానగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడి పాత్ర ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు తేల్చారు. ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేయడానికి రూ.25 లక్షల సుఫారీ ఇచ్చినట్లు విచారణలో బయటపడింది.

లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Advocate Khaja Moinuddin Murder Case
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 29, 2026 | 12:28 PM

Share

హైదరాబాద్‌ మహానగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడి పాత్ర ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు తేల్చారు. ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేయడానికి రూ.25 లక్షల సుఫారీ ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో ఆలం ఖాన్, అతని కుమారుడితో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేయాలనే ప్రణాళిక ఒక్కసారిగా రూపొందించలేదని, గత రెండేళ్లుగా పది సార్లకు పైగా ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించారు. ప్రతి ప్రయత్నం విఫలమవడంతో చివరకు సుఫారీ కిల్లర్ల సహాయంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ వివరాలు కూడా కీలక ఆధారాలుగా మారాయి.

ఇదిలా ఉండగా, ఆలం ఖాన్‌కు సంబంధించిన పలు పాత వ్యవహారాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో తమిళనాడులోని ఊటీలో రూ.7 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసేందుకు ఆలం ఖాన్ ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆ బంగ్లా కొనుగోలుకు సంబంధించిన డబ్బును హవాలా మార్గంలో చెల్లించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈ హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఇప్పటికే 2018లో బెంగుళూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆలం ఖాన్ అనుచరులుగా భావిస్తున్న నిస్సార్ హాసన్ అహ్మద్, నందీశ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.75 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించిన పాత రికార్డులను కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆలం ఖాన్ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసుతో పాటు ఆర్థిక నేరాలు, హవాలా లావాదేవీలు, గత క్రిమినల్ కనెక్షన్లపై కూడా పోలీసులు దృష్టి సారించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..