AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో ఎక్కడా లేని వింత సంప్రదాయం.. పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..!

మత సామరస్యానికి ప్రపంచవ్యాప్త ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా 'రొట్టెల పండుగ'కు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగే ఈ చారిత్రాత్మక పండుగ జూన్ 26 నుంచే ఐదు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలవడంతో దర్గా పరిసరాలు కోలాహలంగా మారాయి.

ప్రపంచంలో ఎక్కడా లేని వింత సంప్రదాయం.. పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల పండుగకు సర్వం సిద్ధం..!
Nellore Rottela Panduga
Ch Murali
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 8:12 PM

Share

మత సామరస్యానికి ప్రపంచవ్యాప్త ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా ‘రొట్టెల పండుగ’కు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగే ఈ చారిత్రాత్మక పండుగ జూన్ 26 నుంచే ఐదు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలవడంతో దర్గా పరిసరాలు కోలాహలంగా మారాయి.

ఈ ఏడాది రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుండి దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దర్గా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు పవిత్రంగా భావించే ‘స్వర్ణాల చెరువు’లో దిగి రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌లను నిర్మించారు. పండుగకు వచ్చే లక్షలాది మందికి తాగునీరు, ఉచిత భోజన సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా మ1రియు భారీ పార్కింగ్ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ ‘కోర్కెల రొట్టెలు’ మార్చుకునే వినూత్న సంప్రదాయం ఉంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ వివిధ రకాల రొట్టెలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగ రొట్టె, విద్యా రొట్టె, కల్యాణ రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, వ్యాపార రొట్టె.. ఇలా అనేక రకాల రొట్టెలను భక్తులు పంచుకుంటారు. తమ మనసులో ఏ కోరిక ఉంటే ఆ రొట్టెను స్వర్ణాల చెరువు వద్ద ఇతరుల నుండి తీసుకుంటారు. ఆ కోరిక తీరిన భక్తులు, తదుపరి ఏడాది రొట్టెల పండుగ నాడు మళ్లీ దర్గాకు చేరుకుని, తాము మొక్కుకున్న రొట్టెను అవసరమున్న వేరే భక్తులకు అందజేసి మొక్కు తీర్చుకుంటారు.

దర్గాలో ఇప్పటివరకు పూర్తి చేసిన వసతులు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పండుగ ఐదు రోజుల పాటు అధికారులు నిరంతరం తనిఖీల్లో ఉండాలని, ఎవరికి కేటాయించిన విభాగాల్లో వారు అప్రమత్తంగా విధి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టాస్ గెలిచిన భారత్.. గెలిస్తే ఫైనల్ పోరు..
టాస్ గెలిచిన భారత్.. గెలిస్తే ఫైనల్ పోరు..
ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి
ఫ్లైట్‌లో ఆస్తమా ఎటాక్‌కు గురై ప్రయాణికుడు మృతి
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..