AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కుక్కల నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన 4 పాఠాలు.. ఇవి జీవితాన్ని మార్చేస్తాయట!

Chanakya Neeti Telugu: చాణక్యనీతి ప్రకారం కుక్కలలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలను మనిషి తన జీవితంలో అలవర్చుకోవాలి. సంతృప్తి, అప్రమత్తత, విశ్వాసం, నిర్భయత్వం వంటి 4 గుణాలు విజయవంతమైన జీవితానికి ఉపయోగపడతాయని చెబుతారు. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Chanakya Niti: కుక్కల నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన 4 పాఠాలు.. ఇవి జీవితాన్ని మార్చేస్తాయట!
Chanakya Neeti Telugu
Rajashekher G
|

Updated on: Sep 19, 2026 | 7:39 PM

Share

Chanakya Niti: గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్యనీతి’ ద్వారా మానవ జీవితానికి ఎన్నో విలువైన సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించడంతో పాటు ప్రశాంతంగా, సంతృప్తిగా జీవించేందుకు అవసరమైన అనేక విషయాలను ఆయన వివరించారు. కేవలం పుస్తకాలు, గురువుల నుంచే కాకుండా.. ప్రకృతిలోని జీవులను గమనించడం ద్వారా కూడా మనిషి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చాణక్యుడు సూచించారు. ముఖ్యంగా కుక్కలో కనిపించే కొన్ని లక్షణాలను మనిషి తన జీవితంలో అలవర్చుకోవాలని చాణక్యనీతి చెబుతుంది. ఈ గుణాలు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా పెంచుతాయని భావిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దొరికిన దాంట్లో సంతృప్తిని పొందడం

కుక్కకు తినడానికి ఏది దొరికినా అది సంతోషంగా స్వీకరిస్తుంది. చిన్న ఆహార ముక్క దొరికినా దానిని తృప్తిగా తింటుంది. ఇదే విషయాన్ని మనిషి కూడా జీవితంలో అనుసరించాలి. అవసరానికి మించిన కోరికల వెంట పరుగెత్తుతూ మనశ్శాంతిని కోల్పోకుండా.. తన శ్రమతో సంపాదించిన దానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. సంతృప్తి అనేది ప్రశాంతమైన జీవితానికి ముఖ్యమైన పునాది అని చాణక్యనీతి సూచిస్తుంది.

నిద్రలోనూ అప్రమత్తంగా ఉండటం

కుక్క గాఢంగా నిద్రపోతున్నప్పటికీ, చిన్న శబ్దం వినిపించినా వెంటనే మేల్కొని అప్రమత్తమవుతుంది. అదే విధంగా మనిషి కూడా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ తన బాధ్యతలు, లక్ష్యాలపై అవగాహన కలిగి ఉండాలని చాణక్యనీతి చెబుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండటం జీవితంలో ముఖ్యమైన గుణం.

ఇవి కూడా చదవండి

విశ్వాసం, విధేయత

కుక్కకు యజమాని పట్ల ఉండే విశ్వాసం, విధేయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యజమానిని, తనకు ఆశ్రయం ఇచ్చిన వారిని కాపాడేందుకు అది ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. ఇదే విధంగా మనిషి కూడా తనను నమ్మిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల పట్ల విశ్వాసంగా ఉండాలి. మనకు అండగా నిలిచిన వారిని కష్టకాలంలో మరచిపోకుండా.. వారికి కృతజ్ఞతగా ఉండటం మంచి వ్యక్తిత్వానికి గుర్తు.

నిర్భయంగా నిలబడటం

తన పరిధిలోకి అపరిచితుడు వచ్చినప్పుడు కుక్క వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఎదుటి వ్యక్తి ఎంత బలంగా ఉన్నాడన్నది పట్టించుకోకుండా తన పరిధిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా మనిషి కూడా తన సూత్రాలు, విలువలు, లక్ష్యాల విషయంలో ధైర్యంగా నిలబడాలి. అన్యాయం ఎదురైనప్పుడు భయపడకుండా సత్యం వైపు నిలబడే ధైర్యాన్ని కలిగి ఉండాలని చాణక్యనీతి సూచిస్తుంది.

చివరిగా.. చాణక్యనీతి ప్రకారం ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి మనిషి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చు. కుక్కలో కనిపించే సంతృప్తి, అప్రమత్తత, విశ్వాసం, నిర్భయత్వం వంటి లక్షణాలను జీవితంలో అలవర్చుకుంటే వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చనే భావన ఈ బోధనలో కనిపిస్తుంది.

(Disclaimer: ఈ కథనం చాణక్యనీతి, సంప్రదాయ బోధనల ఆధారంగా రూపొందించబడింది. వీటిని ఆధ్యాత్మిక/నైతిక సూచనలుగా మాత్రమే పరిగణించాలి.)

Follow Us