Hyderabad: ఎబ్బే.. ఇదేంపాడుపని టీచరమ్మా.. 10వ తరగతి విద్యార్థితో అఫైర్.. కట్ చేస్తే..
పాఠాలు చెప్పమ్మా టీచరమ్మా అంటే.. ఎవరూ ఊహించని రీతిలో తన విద్యార్థితో జంప్ అయ్యింది. సంచలనంగా మారిన ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పాఠాలు చెప్పమ్మా టీచరమ్మా అంటే.. ఎవరూ ఊహించని రీతిలో తన విద్యార్థితో జంప్ అయ్యింది. సంచలనంగా మారిన ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చందానగర్‌కు చెందిన బాలుడు.. ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే, క్లాస్ టీచర్ ఆ అబ్బాయికి పాఠాలు చెప్పేందుకు బదులుగా ప్రేమ పాఠాలు చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. ప్రేమకాస్తా ముదిరి.. జంపింగ్ జపాంగ్ అంటూ అతన్ని తీసుకుని పారిపోయింది. 10 రోజుల క్రితం స్కూల్ టీచర్.. ఆ విద్యార్థిని తీసుకుని పారిపోగా విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
తమ కుమారుడు కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు, తమ కూతురు కనిపించడం లేదంటూ అటు టీచర్ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రాథమిక విచారణలో స్కూల్ టీచరే.. ఆ బాలుడిని తీసుకుని పారిపోయినట్లు తేలింది. గత పది రోజుల వీరిద్దరూ వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా వీరిని పట్టుకున్నారు. వీరిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. కాగా, 10వ తరగతి విద్యార్థిని ఓ టీచర్ లేపుకెళ్లడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..