- Telugu News Photo Gallery Business photos Tips to follow before Buying or Renewal of Car Insurance For speedy claim of damage recovery
Car Insurance Tips: కారు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే..!
Car Insurance Tips: మన భారతదేశంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఆ నేపథ్యంలో కొత్తగా కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు లేదా కారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే..
Updated on: Mar 04, 2023 | 8:50 AM

Car Insurance Tips: కొత్తగా కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు లేదా కారు ఇన్సూరెన్స్ పాలసీ రెన్యువల్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మన భారతదేశంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఆ నేపథ్యంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలను పాటించండి.

కారు ఇన్సూరెన్స్ తీసుకునే వారిలో కొద్ది మంది మాత్రమే అన్ని విధాల ఆలోచించి తమ అవసరాలకు తగిన విధంగా పాలసీ తీసుకుంటారు. కారు ఇన్సూరెన్స్ తీసుకునే విషయంలో.. చాలా మంది తమ కారు ఇన్సూరెన్స్ పాలసీ ట్రాఫిక్ వయోలేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తారు. అయితే మీకు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

వాస్తవానికి సరైన కారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది కేవలం మీకు, మీ వాహనానికి మాత్రమే కాదు.. మీ వల్ల ఎదుటి వారి వాహనానికి జరిగిన డ్యామేజీని, డ్రైవర్ ఆస్పత్రి ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. అయితే ఏయే పాలసీ ఏ మేరకు ప్రొటెక్షన్ ఇస్తాయో తెలుసుకుంటే క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఇన్సూరెన్స్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే.. కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని కాకుండా అన్ని విధాల పూర్తిగా కవర్ అయ్యేలా కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ అసలు ప్రయోజనాలు వర్తిస్తాయని కారు ఇన్సూరెన్స్ గురించి తెలిసిన ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి, కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌కి తేడా ఏంటనే కదా ఇప్పుడు మీ సందేహం..? అక్కడికే వస్తున్నాం. కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో ఇరువర్గాలు కవర్ అవడంతో పాటు ప్రమాదానికి గురైన రెండు పార్టీలకు డ్యామేజీ కవర్ ఖర్చుల రికవరీ వర్తిస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్, ప్రయాణంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే 24 గంటలపాటు రోడ్ అసిస్టెన్స్, వాహనం చోరీ వంటి అన్ని అంశాలు కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీకి వర్తిస్తాయి.

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కేవలం ప్రీమియం మాత్రమే కాకుండా క్లెయిమ్ సక్సెస్ రేషియో, నిబంధనలు, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొసిజర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రమాదం ఎదురైతే.. ఆలస్యం చేయకుండా వెంటనే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని నిబంధనలు విధిస్తాయి.

ప్రమాదం జరిగిన తరువాత ప్రత్యేకించి ఇన్ని రోజులలో మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ తమకు అందితేనే క్లెయిమ్ ప్రాసెస్ మొదలు పెడతామని కంపెనీలు వంకలు పెడుతుంటాయి. అందుకే ఆలస్యం చేసే కొద్ది క్లెయిమ్ సెటిల్మెంట్ రిస్క్ పెరుగుతుంటుంది.

అలాగే ఏ మేరకు డ్యామేజీ జరిగిందో.. ఆ మేరకే నిజాయితీగా డ్యామేజీని క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కారు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ప్రమాదాలు ఎదురైనప్పుడు పెద్దగా ఇబ్బంది లేకుండా పని పూర్తవుతుంది.




