- Telugu News Photo Gallery Bajaj Chetak Premium 2023 Editon Launched, Know About The Features, Price Here
Bajaj Scooter: సరికొత్త వెర్షన్‌లో బజాజ్ చేతక్ స్కూటర్.. 90 కి.మీ మైలేజ్.. పెట్రోల్‌తో పన్లేదు ఇక!
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ..
Updated on: Mar 03, 2023 | 9:25 AM

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. సరికొత్త వెర్షన్లలో వాహనాలను తయారు చేస్తుంటారు.

ఇందులో భాగంగానే బజాజ్.. తన బెస్ట్ మోడలైన చేతక్‌ను.. ఇటీవల సరికొత్త 'ప్రీమియం ఎడిషన్'లో విడుదల చేసింది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, ధర ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ సరికొత్త బజాజ్ చేతక్ స్కూటర్ వేరియంట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అవి మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించిన బుకింగ్స్ సైతం ప్రారంభమయ్యాయి. సదరు కంపెనీ ఏప్రిల్‌లో స్కూటర్లను డెలివరీ చేయనుంది.

ఇక మోడల్ విషయానికొస్తే.. డ్యూయెల్ టోన్ సీట్, రియర్ వ్యూ మిర్రర్స్, బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లు, హెడ్‌ల్యాంప్ కేసింగ్, బ్లింకర్లు వంటివి ఉన్నాయి.

ఈ బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్‌లో 2.9 కిలోవాట్ బ్యాటరీ అమర్చబడి ఉండగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 90కిలోమీటర్లు మైలేజ్ పొందొచ్చు. ఇక ఇండియాలో దీని ధర రూ. 1.52 లక్షలు(ఎక్స్-షోరూమ్)





























