Hyderabad: సినిమాలు చూసి హైదరాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ.. అసలేం జరిగిందంటే ?

|

May 30, 2023 | 8:05 PM

ఈనెల 27వ తేదిన ఐటీ అధికారులమని చెప్పి సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు.దోపిడికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

Hyderabad: సినిమాలు చూసి హైదరాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ.. అసలేం జరిగిందంటే ?
Arrest
Follow us on

ఈనెల 27వ తేదిన ఐటీ అధికారులమని చెప్పి సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు.దోపిడికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. తనిఖీల పేరుతో నిందితులు 17 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారని.. ఎలాంటి ఆధారాలు బయటపడకుండా నిందితులు జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు. మొత్తం సిబ్బందిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయగా.. ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దొంగలు నగరంలోకి వచ్చినట్లు తెలిపారు.

రంజాన్ తర్వాత ఖానాపూర్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి పనిలో చేరాడు. అయితే అతను ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా చోరీ చేసేందుకు ప్రణాళిక వేసింది. జాకీర్ నుంచి వివరాలు సేకరించిన అనంతరం పోలీసులు మహారాష్ట్రలోని ఖానాపూర్‌కు వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, 10 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుల కోసం మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక్కడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూర్య నటించిన ‘ గ్యాంగ్ ‘ సినిమా , అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ చిత్రం చూసి చోరికి ప్లాన్ వేసినట్లు నిందితులు విచారణలో బయటపెట్టినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..