Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్..
తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్‌పీ) ఫేజ్ -1కు సంతోష్‌నగర్ వద్ద జలమండలి జంక్షన్ పనులు చేపట్టనుంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా సంతోష్‌నగర్ జంక్షన్ వద్ద జరుగుతున్న నల్గొండ – ఓవైసీ హాస్పిటల్ ఫ్లైఓవర్ డౌన్ ర్యాంప్ పిల్లర్ల అలైన్‌మెంట్ కింద కేడీడబ్ల్యూఎస్‌పీ ఫేజ్ -1కు చెందిన 450 ఎంఎం, 600 ఎంఎం డయా పైప్‌లైన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పైప్‌లైన్లను పక్కకు జరిపేందుకు జంక్షన్ పనులు చేపట్టాలని, తద్వారా ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకాలు తొలగించాలని జలమండలి నిర్ణయించింది.
కావున, తేదీ: 08.12.2021, బుధవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 09.12.2021, గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 1 కింద ఉన్న రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 – మిరాలం, కిషన్‌బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2ఏ – సంతోష్‌నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకూత్‌పురా, మాదన్నపేట, మహబూబ్ మాన్షన్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2బీ – రియాసత్‌నగర్, ఆలియాబాద్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – బొగ్గులకుంట, అప్జల్‌గంజ్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, నల్లకుంట, చిలకలగూడ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు.
6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10ఏ – దిల్‌సుఖ్‌నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు.
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – బొంగుళూరు రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు.
8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 25 – మన్నెగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
ఇవి కూడా చదవండి: Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. 10 రోజుల్లోనే ‘రైతుబంధు’
Snoring Tips: గుడ్ న్యూస్.. గురకను మాయం చేసే అద్భుతమైన నివారణ చిట్కా..