Hyderabad: బెట్టింగ్స్ వేసే మహానుభావులూ..! ఒక్కసారి ఈ సూసైడ్ నోట్ చదవండి…
బెట్టింగ్స్ వేయడం వల్ల కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. పోయిన డబ్బును తిరిగి రాబట్టాలంటూ పెద్ద ఊబిలో ఇరుక్కుపోతారు చాలామంది. ఈ మధ్య పెద్ద ఎత్తున బెట్టింగ్స్‌కు అలవాటుపడటం ఆందోళన కలిగిస్తుంది.
Telangana: అతను ఆన్‌లైన్ గేమ్‌లకు(Online Games) అలవాటు పడ్డాడు. నెమ్మదిగా బెట్టింగ్ వైపు అడుగులు పడ్డాయి.ఆ జూదపు ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాడు. ఏకంగా రెండేళ్లు వాటి ఉచ్చులో చిక్కుకున్నాడు. తన దగ్గరున్న మూడు క్రెడిట్ కార్డులను వాడేయడంతో పాటు.. రెండు లోన్‌యాప్‌ల ద్వారా అప్పు తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. దీంతో.. ఆరు నెలలుగా డ్రిపెషన్‌లోకి వెళ్లిపోయి.. రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో అత్తాపూర్(Attapur)లో జరిగిందీ ఘటన. మంచిగా సాగుతున్న తన జీవితం ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి దారి తప్పిందంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు దత్తాత్రేయ. రెండేళ్లలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు 7లక్షలు పోగొట్టుకున్నాడు. మరో లక్ష 70వేలు లోన్ తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ కంటిన్యూ చేశాడు. ఆ డబ్బు కూడా పోయింది. ఉన్న సొమ్ము పోయింది. అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వడ్డీతో సహా అప్పు చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్లు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన దత్తాత్రేయ ఆత్మహత్య చేసుకున్నాడు.