AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..

లోన్ కట్టలేదని బరితెగించి ప్రవర్తించారు లోన్ యాప్ నిర్వాహకులు.. తల్లి లోన్ తీసుకొని చెల్లించడం లేదని.. పదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో విగిసిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.

ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..
Loan App Harassment
Anand T
|

Updated on: Sep 09, 2026 | 8:36 AM

Share

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. లోన్ ఈఎంఐ టైంకి కట్టలేదన్న నెపంతో లోన్ యాప్ నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ ఓ మహిళపై ఒత్తిడి తేవడమే కాకుండా, పదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజలింగం కాలనీకి చెందిన ఓ మహిళ తన బంధువు అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్‌లో డబ్బులు తీసుకుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దిరోజులుగా ఆమె ఈఎంఐ చెల్లించడం ఆపేసింది. దీంతో అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకులు ఆమెకు ఫోన్లు చేసి లోన్ కట్టాలని వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. నిర్వాహకుల ఆగడాలు భరించలేక ఆమె ఆ నంబర్లను బ్లాక్ చేసినప్పటికీ, వారు ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ నిరంతరం వేధిస్తూనే ఉన్నారు.

ఒకానోక సందర్భంలో మరీ బరితెగించిన నిర్వాహకులు, బాధితురాలి పదవ తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి… ఆ ఫొటోలను వాట్సప్ ద్వారా బాధిత తల్లికి పంపించారు. వెంటనే లోన్ డబ్బు చెల్లించకపోతే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు.

ఇక లోన్ యాప్ నిర్వాహకుల బ్లాక్‌మెయిలింగ్‌తో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఏం చేయాలో అర్థంకాక మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి ఫిర్యాదు చేసింది. జరిగిన సంఘటనను మొత్తం పోలీసులకు వివరించింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గడ్డం వెనక సీక్రెట్ ఇదేనా?
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
ఒక్క రోజులో గోకుడు గజ్జి, తామరను ఇట్టే తరిమికొట్టొచ్చు..
శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఇక తిరుగులేదట!
శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశులకు ఇక తిరుగులేదట!
బొల్లారం ఆర్మీ వెపన్స్ చోరి కేసులో కీలక అప్డేట్
బొల్లారం ఆర్మీ వెపన్స్ చోరి కేసులో కీలక అప్డేట్
ఇల్లు కట్టేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తే.. గోడలకు పగుళ్లు తప్పవ్
ఇల్లు కట్టేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తే.. గోడలకు పగుళ్లు తప్పవ్