AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు పెంకులను పడేస్తున్నారా? మొక్కల కోసం ఇలా అద్భుతమైన కాల్షియం ఎరువు తయారు చేసుకోండి!

ఇళ్లలో మొక్కలు ఆరోగ్యంగా, వేగంగా పెరగడానికి పోషకాలు చాలా ముఖ్యం. సాధారణంగా మనం గుడ్లు తిన్నాక వాటి పెంకులను వ్యర్థమని పడేస్తుంటాం. కానీ వాటితో అద్భుతమైన ద్రవ రూప ఎరువునుతయారు చేసుకోవచ్చు. గుడ్డు పెంకులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని నేరుగా మట్టిలో వేస్తే కరగడానికి చాలా నెలలు పడుతుంది. అందుకే వీటితో సులభంగా తయారు చేసే లిక్విడ్ ఎరువు మొక్కల ఎదుగుదలకు, ముఖ్యంగా కాండం బలంగా మారడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సులభమైన పద్ధతి ద్వారా ఇంటి వద్దే మొక్కలకు పోషకాలను అందించవచ్చు.

గుడ్డు పెంకులను పడేస్తున్నారా? మొక్కల కోసం ఇలా అద్భుతమైన కాల్షియం ఎరువు తయారు చేసుకోండి!
Make A Natural Calcium Liquid
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2026 | 12:10 PM

Share

ఇంట్లో గార్డెనింగ్ చేసే చాలామంది మొక్కలు సరిగ్గా ఎదగడం లేదని, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని ఆందోళన చెందుతుంటారు. మొక్కల ఆరోగ్యానికి నైట్రోజన్, పొటాషియంతో పాటు కాల్షియం కూడా అత్యంత కీలకం. మనం నిత్యం వాడే గుడ్లలో ఉండే పోషకాల గురించి అందరికీ తెలుసు. కానీ, గుడ్డు తొక్కలను మాత్రం మనం చెత్తబుట్టలో పడేస్తుంటాం. నిజానికి ఈ తొక్కలు మొక్కలకు ఒక అద్భుతమైన సహజ ఎరువుగా పనిచేస్తాయి.

కాల్షియం ఎరువు ప్రాముఖ్యత:

గుడ్డు పెంకులు ప్రధానంగా కాల్షియం కార్బోనేట్ తో తయారవుతాయి. మొక్కల కణాలను బలోపేతం చేయడానికి, వేర్లు దృఢంగా మారడానికి కాల్షియం సహాయపడుతుంది. మొక్కల్లో కాల్షియం లోపిస్తే వాటి ఎదుగుదల మందగించి, కొత్త ఆకులు సరిగ్గా రావు. అయితే గుడ్డు పెంకులను నేరుగా ముక్కలు చేసి మట్టిలో వేస్తే, అవి కరిగి మొక్కలకు పోషకాలు అందడానికి దాదాపు 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు సమయం పడుతుంది. అందుకే త్వరితగతిన ఫలితం పొందడానికి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉత్తమ మార్గం.

ఇంటి వద్దే లిక్విడ్ కాల్షియం ఎరువు తయారీ విధానం:

ముందుగా మీరు సేకరించిన గుడ్డు పెంకులను శుభగా కడిగి ఆరబెట్టి, చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ పెంకుల ముక్కలను ఒక గాజు జార్‌లో వేయండి. ఇప్పుడు ఆ జార్‌లో పెంకులు పూర్తిగా మునిగేలా సరిపడా వినెగార్ పోయాలి. వినెగార్ పోయగానే అందులో చిన్న బుడగలు, నురగ రావడం గమనించవచ్చు. ఇది సాధారణ రసాయన చర్య. ఈ మిశ్రమాన్ని సుమారు 48 గంటల పాటు అలాగే ఉంచాలి. ఈ సమయంలో వినెగార్ ప్రభావంతో గుడ్డు పెంకులు మెత్తబడి, అందులోని కాల్షియం పూర్తిగా ద్రవంలోకి విడుదలవుతుంది.

ఇవి కూడా చదవండి

మొక్కలకు ఎలా ఉపయోగించాలి?

ఈ విధంగా తయారైన ద్రవ రూప ఎరువును నేరుగా మొక్కలకు పోయకూడదు. దీనిని సాధారణ నీటిలో పల్చగా చేసి, ఆ తర్వాత కుండీలలోని మొక్కల మట్టికి అందించాలి. ఈ సహజ కాల్షియం ఎరువును ఉపయోగించడం వల్ల మీ ఇంటి తోటలోని మొక్కలు పచ్చగా కళకళలాడుతూ, ఆరోగ్యంగా ఎదుగుతాయి. వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో మొక్కలను సంరక్షించడానికి ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us