AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs IND 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ..!

New Zealand vs India, 2nd T20I: భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 20 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న 3 టీ20ఐల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

NZ vs IND 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ..!
Ind Vs Nz 2nd T20i Playing 11 Toss Update
Venkata Chari
|

Updated on: Oct 24, 2026 | 12:16 PM

Share

New Zealand vs India, 2nd T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఊహించినట్లుగానే, గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడు. మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ వచ్చాడు . కాగా, వైభవ్ సూర్యవంశీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అలాగే, న్యూజిలాండ్ ఒక మార్పు చేసింది. ఆడమ్ మిల్నే స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్‌లో గెలిచిన భారత్, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడతాడని భావిస్తున్నారు. ఇషాన్ కిషన్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడమే ఇందుకు కారణం. మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా సూర్యవంశీ పాల్గొనడంపై సూచనప్రాయంగా తెలిపారు.

ఇది భారత జట్టుకు 300వ టీ20 మ్యాచ్ అవుతుంది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండవ జట్టుగా భారతదేశం నిలుస్తుంది. 304 మ్యాచ్‌లతో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, 200 టీ20 మ్యాచ్‌లు గెలిచిన తొలి దేశంగా కూడా నిలుస్తుంది.

భారతదేశానిదే పైచేయి..

భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 20 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.

హ్యాగ్లీ ఓవల్‌లో ఛేజింగ్ ఈజీ..

హ్యాగ్లీ ఓవల్‌లో జరిగిన తొలి టీ20లో 450కి పైగా పరుగులు నమోదయ్యాయి. పిచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ కావచ్చు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ సులభతరం అవుతుందని అంచనా. మ్యాచ్ సమయంలో క్రైస్ట్‌చర్చ్‌లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మంచు కారణంగా, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు.

ఇషాన్ స్థానంలో కుమార్ కుశాగ్ర జట్టులో చేరాడు..

ఇషాన్ స్థానంలో జార్ఖండ్ బ్యాట్స్‌మెన్ కుమార్ కుశాగ్రాను జట్టులోకి తీసుకున్నారు. అయితే, ఇషాన్ కేవలం రెండో టీ20కి మాత్రమే దూరమయ్యాడు. తొలి టీ20లో అతని కుడి అడక్టర్ కండరానికి స్వల్ప గాయం అయింది. అయితే, ఇషాన్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో బీసీసీఐ స్పష్టం చేయలేదు.

ఇండియా ప్లేయింగ్ XI: సంజూ శాంసన్ (కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్-జాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us