AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మకం.. నిరీక్షణ.. 180 ఏళ్ల వారసత్వం.. ఈసారి వెన్నెల వెలుగులో చేప ప్రసాదం!

భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి 2026 సంవత్సరపు తేదీ ఖరారైంది. బత్తిని కుటుంబ సభ్యులు అందించే ఈ చేప ప్రసాదం ఈ ఏడాది జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాధారణంగా పగటిపూట ప్రారంభమయ్యే ఈ పంపిణీ, దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాత్రి వేళ మొదలుకావడం విశేషం.

నమ్మకం.. నిరీక్షణ.. 180 ఏళ్ల వారసత్వం.. ఈసారి వెన్నెల వెలుగులో చేప ప్రసాదం!
Hyderabad Fish Prasadam Distribution
Balaraju Goud
|

Updated on: May 19, 2026 | 11:37 AM

Share

హైదరాబాద్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి 2026 సంవత్సరపు తేదీ ఖరారైంది. బత్తిని కుటుంబ సభ్యులు అందించే ఈ చేప ప్రసాదం ఈ ఏడాది జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాధారణంగా పగటిపూట ప్రారంభమయ్యే ఈ పంపిణీ, దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాత్రి వేళ మొదలుకావడం విశేషం. చేప ప్రసాదం కోసం తరలివచ్చే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ సిద్ధమవుతోంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మృగశిర కార్తి ముహూర్తం సూర్యాస్తమయం తర్వాత వస్తోంది. అందుకే బతిని కుటుంబం రాత్రి 9 గంటలకు పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది. బతిని కుటుంబం 1845వ సంవత్సరం నుండి, అంటే సుమారు 180 ఏళ్లుగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ చేప ప్రసాదం ఒక గొప్ప ఉపశమనంగా ప్రజలు భావిస్తారు.

ఈ ఏడాది సుమారు 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. గత ఏడాది దేశ విదేశాల నుండి సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు మరియు వైద్య సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బతిని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..