హైదరాబాద్ మహానగరంలో కంపించిన భూమి.. భయంతో వణికిపోయిన గాజులరామారం..!
హైదరాబాద్ భూకంపంలో వణికిపోయింది. మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం హైదరాబాద్ శివారులోని పలు ప్రాంతాలపై పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో వణికిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మేడ్చల్ జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్ మెట్‌ఖాన్ గూడ ప్రాంతాల్లో భూమి కంపించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. మంగళవారం ఉదయం 10:10 గంటలకు ఒక్కసారి భూమి కంపించింది. పెద్ద శబ్దంతో భూమి కంపించిందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. రెప్పపాటులో జరిగిన ఘటనతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయి. దీంతో జనం బయటకు పరుగులు తీశారు. ఇక స్థానికంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది స్కూళ్ల యాజమాన్యం.
మెట్‌ఖాన్ గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ సీసీ కెమెరాలో భూకంపం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బెంచీలపై నుంచి జామెంట్రీ బాక్సులు కిందపడ్డాయని విద్యార్థులు, ఉపాధ్యాలు తెలిపారు. ఇది భూ కంపనమేనా లేక మరేదైనా అని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది భూకంపమా లేక పేలుడు పదార్థాలు వల్ల వచ్చిన శబ్దమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు మెట్‌కాన్ కాలనీకి చేరుకుని అధ్యయనం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..