Huzurabad By Election: గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్.. ఈసీకి 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితా

TRS Star Campaigners: ప్రచారంలో అధికార పార్టీ మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా స్టార్‌ క్యాంపెయినర్స్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

Huzurabad By Election: గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్.. ఈసీకి 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితా
Trs
Balaraju Goud

|

Oct 01, 2021 | 9:46 PM

Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక యుద్ధంలో ఇవాళ తొలి అంకం. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభం అయ్యింది. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా..అక్టోబరు 30న పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి హైఓల్టేజ్‌ హీట్ మొదలైంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో‌ బైపోల్‌ అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ మొదలు కావడంతో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆత్మగౌరవ పోరాటమని బీజేపీ అంటే.. అభివృద్ధి మంత్రం జపిస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. అయోమయానికి కేరాఫ్‌ అయిన కాంగ్రెస్‌లో ఇంకా అభ్యర్ధిపైనే క్లారిటీ రాలేదు.

మరోవైపు ప్రచారంలో అధికార పార్టీ మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా స్టార్‌ క్యాంపెయినర్స్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) సమర్పించింది. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇతర టీఆర్ఎస్ నేతలు స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాలో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మునిగిపోయాడు రవిశంకర్, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, వి.సతీష్ కుమార్, గువ్వల బాలరాజు, అరూరి రమేష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కానుమల్ల విజయ, జెడ్పీ చైర్మన్ పేర్లను ఈసీ పంపించింది టీఆర్ఎస్ అధిష్టానం.

ఇదిలావుంటే, ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలనే మార్చివేస్తోంది. గత కొద్ది నెలలుగా క్షేత్రస్థాయిలో TRS, BJP పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. అభ్యర్ధులను ముందే ప్రకటించిన పార్టీలు నియోజకవర్గంలో మోహరించాయి. పోటాపోటిగా సమావేశాలు సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టాయి. అయితే కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. అభ్యర్ధినీ ప్రకటించలేదు. ఈటల రాజేందర్ ఇప్పటికే పాదయాత్ర చేయగా.. సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. అటు వలసలతో ఇతర పార్టీ నేతలకు గాలం వేసిన అధికార పార్టీ ముగ్గురు మంత్రులను ఇదివరకే రంగంలోకి దింపింది. MLAలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్‌ పోటీపోటీగా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్‌ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఇంతవరకూ అభ్యర్ధినే ప్రకటించలేదు. 14 మంది పోటీకి సిద్ధంగా ఉన్నారంటున్న పీసీసీ ప్రచారంలోనూ కాస్త స్లోగానే ఉంది. మరోవైపు హుజూరాబాద్‌ ఎన్నిక అన్ని పార్టీల ఇజ్జత్‌కీ సవాల్‌గా మారాయి. మరి బైపోల్‌లో ఎవరి సత్తా ఏంటో తేలిపోనుంది.

మరోవైపు, ఏదైనా నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే ఆ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్‌ వర్తిస్తుంది. అయితే, 2018లో రాజస్థాన్‌లోని దుడు శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక సమయంలో జైపూర్ జిల్లా మొత్తం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని మొదట ఈసీ ప్రకటించింది. అయితే, రాష్ట్ర రాజధాని కూడా అదే జిల్లాలో ఉన్న నేపథ్యంలో సాధారణ పరిపాలనకు ఇబ్బంది అవుతుందని ఈసీకి విజ్ఞప్తులు అందాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే జిల్లా మొత్తం కాకుండా కేవలం ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే నియమావళి వర్తిస్తుందని ఆ సమయంలో ఈసీ స్పష్టత ఇచ్చింది.

తాజాగా తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం… ఆ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపింది. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా.. హనుమకొండ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. రెండు జిల్లాల్లోనూ కార్పొరేషన్లు ఉన్నందున కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానున్నట్లు తెలుస్తోంది.

Read Also…  Huzurabad By Election: ‘సీఎంనే అంత మాట అంటావా? మరి నువ్వేంటి?’.. ఈటెలపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu