Huzurabad By Election: హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ.. టీఆర్ఎస్ వైపే గ్రామాలకు గ్రామాలు: మంత్రి హరీశ్ రావు
హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకూ ఖాళీ అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. ఆర్థిక మంత్రి

Huzurabad By Election – TRS – BJP: హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకూ ఖాళీ అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని సంగాపురంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కలిసిన పలు మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతునిస్తూ తెరాసలో చేరారు.
జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరారు. లక్ష్మాపురం బీజేపీ గ్రామ అధ్యక్షులు సంపత్ రావు, మాజీ ఉపసర్పంచి శ్రీనివాస్, వారితో పాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు తెరాస నేత శంకర్ రావు నేతృత్వంలో తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హుజూరాబాద్ మండలం రంగాపరం గ్రామానికి చెందిన వంద మంది పద్శశాలీలు రంగాపూర్ గ్రామ తెరాస ఇన్ఛార్జి దుర్గా రెడ్డి నేతృత్వంలో బీజేపీ పార్టీ నుండి తెరాసలో చేరారు.
వారితో పాటు 150 మంది ముదిరాజ్‌లు బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి తెరాసలో చేరారు. ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. సుధాకర్ నేతృత్వంలో కమలాపూర్ మండలం పూసల సంఘం వారు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే తమ ఓటని మంత్రి హరీశ్ రావును కలిశారు. తెరాసలో చేరతామని ప్రకటించారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు జమ్మికుంట, ఇల్లంద కుంట, బూజునూరు, కొత్త పల్లి గ్రామలాకు చెందిన 50 మంది యువకులు నాగిశెట్టి సాయికుమారు నేతృత్వంలో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు.
Read also: Pawan: ‘గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం’.. తూ.గో లో పవన్ శ్రమదానానికి అనుమతి నిరాకరణ